బ్రిటన్ ఎయిర్ బేస్ లోకి చొరబడి.. సైనిక విమానాలపై దాడి.. ఎందుకు?

సెంట్రల్ ఇంగ్లండ్ లోని రాయల్ ఎయిర్ ఫోర్సు స్థావరంలోకి అక్రమంగా చొరబడటమే కాదు.. రెండు సైనిక విమానాలపై దాడికి పాల్పడిన ఉదంతం సంచలనంగా మారింది.;

Update: 2025-06-21 04:02 GMT

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ వ్యతిరేకవాదులు బ్రిటన్ లో షాకింగ్ చర్యకు చేపట్టారు. కలలో కూడా ఊహించలేని పరిస్థితికి కారణమయ్యారు. సెంట్రల్ ఇంగ్లండ్ లోని రాయల్ ఎయిర్ ఫోర్సు స్థావరంలోకి అక్రమంగా చొరబడటమే కాదు.. రెండు సైనిక విమానాలపై దాడికి పాల్పడిన ఉదంతం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఇంజిన్ లోకి ఎరుపు రంగు పెయింట్ చల్లారు. ఈ రెండు విమానాల్ని ఇంధనం నింపటానికి.. ఇతర రవాణా సౌకర్యాల కోసం బ్రిటన్ మిలిటరీ ఈ లోహ విహంగాల్ని వినియోగిస్తోంది.

ఈ వ్యవహారంపై తాజాగా పాలస్తీనా యాక్షన్ గ్రూప్ స్పందిస్తూ.. తమకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్స్ ఫర్డ్ షైర్ లో బ్రిజ్ నార్టన్ ఎయిర్ బేస్ లోకి చొరబడ్డారని అంగీకరించింది. పాలస్తీనాకు చెందిన వారు బ్రిటన్ విమానాల్ని ధ్వంసం చేయటమా? ఎందుకిలా? అన్న ప్రశ్నకు సింఫుల్ సమాధానం.. గాజాలో ఇజ్రాయెల్ దాడులపై బ్రిటన్ ప్రభుత్వం బహిరంగంగా ఖండిస్తున్నా.. పరోక్షంగా ఆ దేశానికి మద్దతు ఇవ్వటమే కారణంగా పేర్కొంటున్నారు.

ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు బ్రిటన్ ఇంధనం నింపటం లాంటి చర్యల్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ దేశ సైనిక విమానాల్ని తమ వర్గం వారు ధ్వంసం చేసినట్లుగా పాలస్తీనా యాక్షన్ గ్రూపు సోషల్ మీడియాలో పోస్టు చేయటం గమనార్హం. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న బ్రిటన్ కు తగిన గుణపాఠం చెప్పటం.. గాజా మారణహోమంలో చురుకైన పాత్ర పోషించటం లాంటి చర్యలకు పాల్పడటాన్ని తప్పు పట్టింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉండే సైనిక స్థావరాల్లోకి ఇద్దరు నిందితులు ఎలా వెళ్లారు? సైనిక విమానాలపై దాడి ఎలా సాధ్యమన్న దానిపై విచారణ అధికారులు విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News