ఉద్ధవ్ శివసేనను బెదర కొడుతున్నారు !

మహారాష్ట్రలో బాల్ థాక్రే శివసేన రెండుగా చీలిన సంగతి విధితమే. తండ్రి స్థాపించిన పార్టీని కలిపి ఉంచలేక ఉద్ధవ్ ఠాక్రే నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2026-06-15 03:32 GMT

మహారాష్ట్రలో బాల్ థాక్రే శివసేన రెండుగా చీలిన సంగతి విధితమే. తండ్రి స్థాపించిన పార్టీని కలిపి ఉంచలేక ఉద్ధవ్ ఠాక్రే నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ పార్టీలో పక్కా మాస్ లీడర్ గా గుర్తింపు కలిగిన ఏక్ నాధ్ షిండే 2022 లో పార్టీని అడ్డంగా చీల్చేసి బీజేపీ వైపు వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. అలా రెండేళ్ళ పాటు ఆయన సీఎం గా పాలించి బీజేపీతో పొత్తులో 2024 ఎన్నికలకు వెళ్ళారు. అరవైకి పైగా ఎమ్మెల్యేలను గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఈసారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక 2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేనకు తొమ్మిది మంది ఎంపీలు వస్తే ఏక్ నాధ్ షిండే శివసేనకు ఏడుగురులు ఎంపీలు గెలిచారు. ఇపుడు ఆపరేషన్ ఉద్ధవ్ శివసేన స్టార్ట్ అయింది అని అంటున్నారు.

అత్యవసర మీట్ :

ఇదిలా ఉంటే తన పార్టీకి చెందిన వారిలో ఏడుగురు ఎంపీలు షిండేకి టచ్ లోకి వెళ్తున్నట్లుగా భారీ ఎత్తున ప్రచారం రావడంతో ఉద్ధవ్ ఠాక్రే తెగ హడావుడి పడుతున్నారు. తాజాగా ఆయన ముంబైలోని తన పార్టీ ఆఫీసులో ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీకి మొత్తం తొమ్మిది మంది ఎంపీలకు గానూ ఆరుగురే హాజరవడం విశేషం. ఇక ఏడుగురు కచ్చితంగా గీత దాటుతారు అంటూ వస్తున్న వార్తల నేపధ్యంలో ఉద్ధవ్ పార్టీని కట్టుబాట్లలో ఉంచాలని చూస్తున్నారు కానీ అది వల్ల అయ్యే పనేనా అన్న చర్చ సాగుతోంది.

బలం పెంచుకోవాలని :

ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ 240 ఎంపీలతో అతి పెద్ద పార్టీగా ఉంటే 16 మంది ఎంపీలతో టీడీపీ రెండవ బలమైన పక్షంగా ఉంది. మూడవ బలమైన పార్టీగా ఏక్ నాథ్ షిండే పార్టీ ఉంది. అయితే ఈ నంబర్ ని మరింతగా పెంచుకోవాలని షిండే చూస్తున్నారు. ఇప్పటికే తమ పార్టీయే అసలైన శివసేన అని ఎన్నికల సంఘం నుంచి గుర్తు కూడా సాధించిన ఆయన ఇదే అదనుగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనను మరింతగా దెబ్బ తీయాలని చూస్తున్నారు. ఇక బీజేపీకి లోక్ సభలో ఎంపీలు చాలా మంది దాకా కావాల్సి ఉంది.

డీలిమిటేషన్ బిల్లు కోసం :

డీలిమిటేషన్ బిల్లుని ఈ వర్షాకాల సమావేశాలలో ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తోంది. పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ తృణమూల్ కాంగ్రెస్ అన్న దానిని నామ రూపాలు లేకుండా చేసే గట్టి ప్రయత్నం సాగుతోంది. ఎమ్మెల్యేలను చీల్చారు, ఎంపీలను కూడా చీల్చేస్తున్నారు. దాంతో బీజేపీకి లోక్ సభలో బలం బాగా పెరగనుంది అని అంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని కూడా పెంచుకుంటే ఎన్డీయేలో 14 మంది ఎంపీలతో మంచి గుర్తింపు రావడమే కాకుండా మహారాష్ట్ర రాజకీయాల్లో మరింత కీలకం కావచ్చు అని ఎత్తుగడ వేస్తున్నారు అని అంటున్నారు.

ఉద్ధవ్ కి ప్రాణ సంకటమే :

తండ్రి బాల్ ఠాక్రే వారసుడిగా రంగంలోకి దిగి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కొన్నాళ్ళ పాటు సీఎం గా మహారాష్ట్రకు పనిచేసిన ఉద్ధవ్ ఠాక్రే కు రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు అంతగా తెలియవు అని అంటారు. అంతే కాదు తండ్రి మాదిరిగా మాస్ ఇమేజ్ కూడా లేదు. ఈ రెండూ ఏక్ నాధ్ షిండేలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఏకంగా సీఎం అయిపోయారు. రానున్న కాలంలో శివసేనను మొత్తం ఒక్కటిగా చేస్తే పూర్తి బలం తనకు దక్కితే మరోసారి సీఎం అవవచ్చు అన్న భవిష్యత్తు ఆలోచనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఏక్ నాధ్ షిండే రాజకీయ చెలగాటం ఆడుతున్నారు. అది కాస్తా ఉద్ధవ్ ఠాక్రే కి ప్రాణ సంకటంగా మారుతోంది. ఎవరు కాదన్నా బీజేపీ అంతకంతకు బలం పెంచుకుంటోంది. దాంతో ఉద్ధవ్ ఠాక్రే వైపు ఉన్న ఎంపీలలో సైతం కొత్త ఆలోచనలు వస్తున్నాయని అంటున్నారు. అనుకున్నది అంతా జరిగితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన మరింతగా బక్క చిక్కి శల్యం కావడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News