సనాతన ధర్మం ఓ రోగం... ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు!
తమిళప్రజలమీద, దక్షిణాది ప్రజలపైనా ఉత్తరాధి ఆధిపత్యం పెరిగిపోతుంది అంటూ ఆ రాష్ట్రంలో తీవ్ర నిరసనలు, రాజకీయ కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తమిళప్రజలమీద, దక్షిణాది ప్రజలపైనా ఉత్తరాధి ఆధిపత్యం పెరిగిపోతుంది అంటూ ఆ రాష్ట్రంలో తీవ్ర నిరసనలు, రాజకీయ కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాధి పార్టీలు.. వారి పత్యాన్ని దక్షిణాదిపై రుద్దాలని భావిస్తున్నారనే స్థాయిలో తమిళనాడు నుంచి కామెంట్లు వినిపిస్తుంటాయి. ఈ సమయంలో ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... సినీ హీరో, డీఎంకే మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. “కొన్నింటిని వ్యతిరేకించలేం కానీ.. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం.. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక సమానత్వానికి ఇది పూర్తి విరుద్ధం.. మరో ఆప్షన్ లేదు.. నిర్మూలించాల్సిందే” అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
తాజాగా సనాతన ధర్మంపై ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారమే రేపుతున్నాయి. సనాతన ధర్మం అంటు వ్యాధి లాంటిదని, దాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్... దానిని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
ఈ సనాతన ధర్మం అని చెప్పే విషయం... సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రెడీ అయిపోయింది! ఇందులో భాగంగా.. బీజెపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ.. మంత్రి మాటలపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని దుయ్యబట్టారు.
ఈ క్రమంలో బీజేపీ నేత స్పందించడంపైనా... ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. మరోఆలోచన లేకుండా తగ్గేదే అన్నట్లుగా తన మాటలను సమర్ధించుకున్నారు. మారణహోమానికి పిలుపునివ‍్వలేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న బలహాన వర్గాల పక్షాన మాట్లాడినట్లు పేర్కొన్నారు.
ఈ విషయంపై ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపిన ఉదయనిధి... కాషాయ బెదిరింపులకు బయపడేది లేదని అన్నారు. ఇదే సమయంలో పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన తాము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతామని తెగేసి చెప్పారు!