• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శివలింగం మీద తేలు...

శివలింగం మీద తేలు కేసీఆర్.. తుమ్మల సెటైర్లు మామూలుగా లేవుగా?

| ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తుమ్మల చేస్తున్న విమర్శలకు ప్రతిగా.. సీఎం కేసీఆర్ ఈ మధ్యన ఆయన గురించి విమర్శలు చేయటం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-11-06 04:29 GMT

అభిమానించే వేళలో ఆకాశానికి ఎత్తేసినట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏ మాత్రం తేడా వచ్చినా మాటలతోనూ.. చేతలతోనూ పాతాళానికి తొక్కేయటంలో ఆయన మహా నేర్పరి. ఇప్పటివరకు ఆయన టార్గెట్ చేసిన నేతలు ఎవరూ కూడా కోలుకోలేని పరిస్థితి. అందుకు భిన్నంగా తాజా పరిణామాలు ఉన్నాయంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి.. ఒకప్పుడు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన తుమ్మల నాగేశ్వరరావు.. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగటం తెలిసిందే.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తుమ్మల చేస్తున్న విమర్శలకు ప్రతిగా.. సీఎం కేసీఆర్ ఈ మధ్యన ఆయన గురించి విమర్శలు చేయటం తెలిసిందే. దీనికి ప్రతిగా తుమ్మల సైతం రియాక్టు అవుతున్నారు. తాజాగా ఖమ్మం పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం వేళ.. సీఎం కేసీఆర్ ను కొత్త తరహాలో పోలుస్తూ.. ఆసక్తికర వ్యాఖ్య చేవారు. తుమ్మల శివలింగం మీద ఉన్న తేలుగా అభివర్ణించారు.

‘‘సీఎం కేసీఆర్ శివలింగం మీద ఉన్న తేలు లాంటోడు. తేలును కొడదామంటే.. కింద ఉందన్న లింగానికి తగులుతుందన్న భయం ఉంటుంది. అలానే కేసీఆర్ ను కొడదామంటే.. కింద తెలంగాణ అనే లింగం ఉన్నట్లుగా చేస్తారు. ఓటు అనే ఆయుధంతో ఆ తేలును కొట్టాలి’’ అంటూ తుమ్మల చేస్తున్న వ్యాఖ్యలు ఆకర్షిస్తున్నాయి. ఎంతో మంది యువకుల బలిదానాలకు తెలంగాణ వచ్చిందన్న తుమ్మల.. తెలంగాణ తన ఒక్కడిదే అన్నట్లుగా కేసీఆర్ మాటలు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలనను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందన్న తుమ్మల.. 2014లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయటం.. ఓడిపోవటం తెలిసిందే. అనంతరం ఆయన్ను స్వయంగా ఆహ్వానించిన కేసీఆర్.. మంత్రి పదవి ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అనంతరం పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యంతోమరణించటం.. ఈ సందర్భంగా పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మలను అభ్యర్థిగా బరిలోకి దించటం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో తుమ్మలను రంగంలోకి దించి.. మంత్రాంగం నడిపిన కేసీఆర్ దెబ్బకు.. తుమ్మల గెలవగా.. రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి ఓడారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల.. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడటం తెలిసిందే. ఆ తర్వాత కందాల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరగా.. ఇటీవల తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోవటం తెలిసిందే.

అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పాలేరు నుంచి తుమ్మలను కాకుండా పొంగులేని శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించటం తెలిసిందే. మరోవైపు కందాలను తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ డిసైడ్ చేసింది. తుమ్మలకు ఖమ్మం టికెట్ ను కాంగ్రెస్ కేటాయించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న తుమ్మల.. తనకు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయనపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా మిగిలిన వారితో పోలిస్తే.. సీఎం కేసీఆర్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేయటంలో తుమ్మల ముందున్నారు.

Tags:    
  • Tummalanageswarao 
  • Kcr 
  • Tsassemblyelection 
  • Khammam 
  • Palair 
  • Ajaykumar 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS