ఏకసభ్య కమిషన్ : సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది ?

ఏపీ రాజకీయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ కల్తీ ఇష్యూ ఇపుడు కీలకమైన విషయంగా మారిపోయింది.;

Update: 2026-02-22 14:30 GMT

ఏపీ రాజకీయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ కల్తీ ఇష్యూ ఇపుడు కీలకమైన విషయంగా మారిపోయింది. దీని మీదనే హాట్ హాట్ గా డిబేట్ సాగుతోంది. నిన్నటికి నిన్న వినుకొండలో జరిగిన స్వచ్ఛ ఆంధ్రా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ లడ్డూ విషయం గురించి ప్రస్తావించారు. కల్తీ చేసిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మరో వైపు చూస్తే కూటమి ప్రభుత్వం ఈ విషయం మీద పూర్తి నివేదిక కోరుతూ ఏక సభయ కమిషన్ ని నియమించింది. అది ఒక సంచలనం అయితే దాని మీద బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్ళారు.

సడెన్ ఎంట్రీతో :

ఏపీలో లడ్డూ ఇష్యూ టీడీపీ కూటమి వైసీపీల మధ్య రాజకీయ రచ్చగా మారి పరస్పరం విమర్శలు చేసుకుంటున్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలో సడెన్ గా సుబ్రహ్మణ్య స్వామి ఎంట్రీ ఇచ్చారు. ఆయన లడ్డూపై ఏకసభ్య కమిటీని కూటమి ప్రభుత్వం నియమించడాన్ని తప్పు పడుతున్నారు. దాంతో ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సవాల్ చేస్తూ :

ఇక ఏకసభ్య కమిషన్ ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా వేస్తుంది అన్నది స్వామి లీగల్ పాయింట్ గా కనిపిస్తోంది. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్ నివేదిక వచ్చింది. దాని మీద మళ్లీ ఏక సభ్య కమిషన్ ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా వేయగలదు అన్నది ఆయన ప్రశ్నగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం ఈ నెల 23న విచారణ చేపట్టనుంది.

కల్తీ లడ్డూ ఇష్యూ మీదనే :

ఇక వెనక్కి వెళ్తే 2024 సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారిగా లడ్డూలో కల్తీ జరిగింది అని కామెంట్స్ చేశారు. అది కాస్తా జాతీయ స్థాయిలో వైరల్ అయింది. ఆ మీదట ఏపీలో కూడా రచ్చ సాగింది. దీని మీద ఏపీ ప్రభుత్వం ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. ఇక ఇదే సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టులో కేసు వేశారు. అదే విధంగా సుబ్రహ్మణ్యస్వామి కూడా కోర్టుకు వెళ్ళారు. ఈ పిటిషన్ల మీద విచారణ జరిపిన కోర్టు సిట్ ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇటీవల సీబీఐ సిట్ దీని మీద చార్జిషీట్ ని ఏకంగా 400 పేజీలకు పైగా రూపొందించింది. దానికి కోర్టుకు సమర్పించింది. విషయం ఇలా ఉంది. అయితే సిట్ నివేదిక తమకు అనుకూలంగా ఉందని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కల్తీ జరిగింది అని కూటమి నేతలు అంటున్నారు. విషయం ఇలా ఉంటే ఏక సభ్య కమిషన్ తో మొత్తం వ్యవహారం తేలుస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

ఏమి జరగనుంది :

ఇక సుప్రీం కోర్టులో సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఏమి చెబుతుంది అన్నది ఇపుడు ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే లడ్డూ కల్తీ జరిగింది అన్న విషయంలో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థను నియమించింది. ఆ విచారణ జరుగుతోంది. చార్జిషీట్ దాఖలు చేసింది. మరి ఇదే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం మరో కమిషన్ వేయవచ్చా అన్నదే ఇపుడు న్యాయపరమైన సంశయంగా ఉంది. . . వేయవచ్చు అని కొందరు అంటూంటే వేయకూడదు ఇది న్యాయ ధిక్కారం అని మరి కొందరు అంటున్నారు. మరి దీని మీద అత్యున్నత న్యాయస్థానం స్పందన ఆసక్తికరంగా మారింది. చూడాలి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News