ట్రంప్ వాడిన కారు పలికిన ధర ఎంతో తెలిస్తే షాకే

ట్రంప్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఆయన క్రేజ్ ఇసుమంత తగ్గలేదు. రెండోసారి అమెరికా అద్యక్షుడిగా బరిలో ఉన్న ఆయనకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన లభిస్తోంది.

Update: 2024-02-04 08:30 GMT

మొండితనం.. నోటికి ఎంత వస్తే అంత మాట అనేయటం.. వెనుకా ముందు చూసుకోకపోవటం.. విలువలకు తనదైన వక్రభాష్యం చెబుతూ తనకు ఇష్టమైనోళ్లను నెత్తి మీద.. నచ్చనోళ్లను పాతాళానికి తొక్కేయటమే కాదు.. తిరిగి లేవకుండా చేసే సత్తా ఆయన సొంతం. చరిత్రలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయని ఎన్నో ఘనకార్యాలు ఆయన పాలనలో నమోదయ్యాయి. చివరకు పార్లమెంటు మీద దాడి కూడా జరిగిపోయింది. మొత్తంగా తన పదవీ కాలం మొత్తాన్ని మూడు వివాదాలు.. ఆరు పంచాయితీలుగా మారింది.


ట్రంప్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఆయన క్రేజ్ ఇసుమంత తగ్గలేదు. రెండోసారి అమెరికా అద్యక్షుడిగా బరిలో ఉన్న ఆయనకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. దీనికి తగ్గట్లే తాజాగా ఆయన అప్పుడెప్పుడో వాడేసిన కారును తాజాగా వేలానికి పెట్టారు. డొనాల్ట్ ట్రంప్ వాడిన విలాసవంతమైన లంబోర్ఝిని డయాబ్లో వీటీ కారును వేలం వేశారు.

ఈ వేలంలో రికార్డు స్థాయి మొత్తం పలికింది. ఇంతకూ వేలంలో పలికిన ధర ఎంతో తెలుసా? అక్షరాల 1.1 మిలియన్ డాలర్లు. మన రూపాయిల్లో అయితే.. రూ.9.14 కోట్లుగా చెప్పాలి.ప్రపంచంలో అత్యంత ఖరీదైన.. ప్రజాదరణ పొందిన కారుగా లంబోర్ఝికి పేరుంది. అయితే.. 1997లో ట్రంప్ తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న ఈ కారున ఇంత భారీ ధరకు పలకటం ఆసక్తికరంగా మారింది. తాజాగా జరిగిన వేలంలో దీన్ని సొంతం చేసుకునే పెద్ద మనిషితో పాటు.. ఈ కారు అమెరికాలో అమ్ముడైన 132 ఖరీదైన కారుల్లో ఒకటిగా చెబుతున్నారు.

Read more!

1997లో కొనుగోలు చేసిన ఈ కారును 2002లో ట్రంప్ అమ్మేశారు. ఆ తర్వాత ఈ కారును 2016లో ఈబేలో సేల్ కింద కనిపించింది. ఆ తర్వాత ఇదెంతమంది చేతులు మారిందో తెలీదు కానీ తాజాగా ఈ కారు రూ.9.14 కోట్ల భారీ ధరకు అమ్ముడు కావటం ఆసక్తికరంగా మారింది. 2016 వరకు ఈ కారు 14,655 కిమీ. ప్రయాణించినట్లుగా చెబుతున్నారు. వేలానికి వచ్చే సమయానికి 15434 కి.మీ. ప్రయాణించిందని.. 2016 తర్వాత దీన్ని ఎక్కువగా వాడట్లేదని చెబుతున్నారు.


Tags:    

Similar News