• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బర్త్ రైట్ సిటిజన్ ...

బర్త్ రైట్ సిటిజన్ షిప్... ట్రంప్ అంతమాట అనేశారేంటి?

| అయితే.. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయ్యింది.. ఇంటా బయటా ఆందోళనలు మొదలయ్యాయి.

By - Tupaki Desk
Update: 2025-01-31 14:15 GMT

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ చేసిన ఒక పని భారత్ తో పాటు పలు ప్రపంచ దేశాలకు బిగ్ షాక్ కలిగించాయి. ఇందులో భాగంగా... ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జన్మతః పౌరసత్వపు హక్కును రద్దు చేశారు. అయితే.. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయ్యింది.. ఇంటా బయటా ఆందోళనలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో డెమోక్రాట్ల పాలనలో ఉన్న రాష్ట్రాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాద సమూహాలు, పలువురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. దీంతో... ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఆర్డర్స్ ని నిలిపివేసింది కోర్టు. ఈ సమయంలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు విన్న తర్వాత ఎవరెలా ఫిక్స్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

అవును... జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. హెచ్-1బీతో సహా పలు రకాల వీసాలపై అమెరికాలో వెళ్లిన విదేశీ దంపతులకు పిల్లలు పుట్టినా వారికి అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది. ఈ అవకాశాన్ని తాజాగా ట్రంప్ తొలగిస్తూ ఉత్తర్వ్యులిచ్చారు.

ఈ సమయంలో స్పందించిన ట్రంప్... బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశ్యంతో ఈ జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారు. ఒకసారి గతన్ని గుర్తు చేసుకుంటే అర్ధమవుతుంది. అంతేగానీ... ప్రపంచం మొత్తం వచ్చి అమెరికాలో పోగుపడటం కోసం ఈ చట్టాన్ని తీసుకురాలేదు అంటూ ఘాటుగా స్పందించారు!

ఇదే సమయంలో.. చాలామంది మన దేశానికి వస్తున్నారు.. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించేసుకుంటున్నారు.. దీంతో అర్హత లేని పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తోంది అంటూ కామెంట్ చేశారు. అయితే.. వాస్తవానికి ఈ చట్టం రూపొందించింది అందుకు కాదు.. బానిసల పిల్లల కోసం గొప్ప ఉద్దేశ్యంతో తీసుకొచ్చింది ఈ చట్టం అని అన్నారు.

దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. ఇలా జన్మతః పౌరసత్వంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఎవరు బడితే వారు వచ్చి అమెరికాలో స్థిరపడటం కోసం కాదు ఈ బర్త్ రైట్ సిటిజన్ షిప్ అనే ట్రంప్ మాటలు చాలా మంది గుండెలకు గుచ్చుకున్నట్లున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయని చెబుతున్నారు.

Tags:    
  • USpresident 
  • USpresidentDonaldtrump 
  • Trump 
  • Donaldtrump 
  • Birthrightcitizenship 
  • Executiveorder 
  • H1Bvisa 
  • USimmigrationpolicy 
  • SupremeCourt 
  • Legalchallenges 
  • UScitizenship 
  • Foreignnationals 
  • Americanlaw 

Similar News

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS