"రజాకార్" నిర్మాతకు బెదిరింపులు... కేంద్రం కీలక నిర్ణయం!

దీంతో... అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది!

Update: 2024-03-21 13:18 GMT

ఇటీవల విడుదలైన "రజాకార్" సినిమా సంగతి తెలిసిందే. తెలంగాణలో నాడు ప్రజానికం ఎదుర్కొన్న సమస్యలకు దృశ్యరూపమే ఈ సినిమా అని.. నాడు కెమెరాలు, సెల్ ఫోన్లూ ఉండి ఉంటే నాటి ఘోరాలు అన్నీ నాడే చిత్రీకరించేవారమని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాతకు ఒక సమస్య ఎదురైంది. దీంతో... అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది!

అవును... "రజాకార్" సినిమా తెలంగాణలో అలజడి సృష్టిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా పట్ల ఒకవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెబుతున్నారు. ఈ సమయంలో నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ సుమారు 1000కి పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని నారాయణ రెడ్డి చెబుతున్నారు!

దీంతో తనకు భద్రత కల్పించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం ఆయనకు భద్రతను కల్పించింది. ఇందులో భాగంగా 1+1 సీఆర్పీఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా... ఇటీవల విడుదలైన "రజాకార్" సినిమాకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం విడుదలకు ముందు నుంచీ కొన్ని వివదాల్లో చిక్కుకుంది. పైగా లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదలవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా నిర్మాత బీజేపీ నేత కావడంతో వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఇక "రజాకార్‌" సినిమాలో బాబీ సింహా, వేదిక, ఇంద్రజ, అనసూయ, ప్రేమ తదితరులు నటించారు. ఇక భీంస్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. యాట సత్యనారాయణ రచన, దర్శకత్వ బధ్యతలు చేపట్టారు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది!

Tags:    

Similar News