సికింద్రాబాద్ నియోజకవర్గం అభ్యర్థిని మార్చడానికి కారణాలేంటో తెలుసా?

తమ ఓటు బ్యాంకు పెరగాలంటే ఏం చేయాలి? ఎవరిని తీసుకోవాలి? ఎవరిని పోటీలో నిలపాలనే చర్చలు జరుగుతూనే ఉంటాయి.

Update: 2024-03-29 10:53 GMT

రాకీయాల్లో ఎవరి అంచనాలు వారికుంటాయి. పార్టీ టికెట్ కోసం నానా తంటాలు పడుతుంటారు. అదే సందర్భంలో పార్టీ కూడా అతడి వల్ల తమకు కలిగే ప్రయోజనాల గురించి పలు రకాల విశ్లేషణలు చేస్తుంది. తమ ఓటు బ్యాంకు పెరగాలంటే ఏం చేయాలి? ఎవరిని తీసుకోవాలి? ఎవరిని పోటీలో నిలపాలనే చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈనేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ మనుగడపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయనకు టికెట్ ఇవ్వాలా? వద్దా అనే డైలమాలో పార్టీ యంత్రాంగం పడిపోయింది.

రాష్ట్రంలో టఫ్ గా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల డెవలప్ మెంట్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ నియోజకవర్గంపై కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తోంది. ఇక్కడ నుంచి పోటీలో ఉన్న బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ధీటైన అభ్యర్థి కావాలనే ఆలోచనలో పడిపోయింది. అందుకే దానం నాగేందర్ ను బరిలో నిలపాలని చూస్తోంది.

దానం బలమెంత? ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తారా? కిషన్ రెడ్డి దూకుడుకు పగ్గాలు వేస్తాడా? కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకును పెంచుతాడా? అనే కోణంలో ఆలోచిస్తోంది. పైగా దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పడంతో పార్టీలో చేరేటప్పుడే అందుకు దానం సమ్మతించారు. ఇప్పుడు రాజీనామా చేసేందుకు వెనకాడుతున్నారు.

Read more!

పార్టీ అధిష్టానం కూడా మొదట దానం పేరును ప్రకటించినా ఆయన రాజీనామా చేయకపోవడంతో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తోందట. ఇక్కడ నుంచి ఓ మాజీ మంత్రి పేరు పరిశీలనలో ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దానం భవితవ్యం ప్రశ్నార్థకంలో పడే ప్రమాదముందని అంటున్నారు. రెంటికి చెడ్డ రేవడిలా మారే అవకాశం ఉంది.

కిషన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు. ఆయనను తట్టుకుని గెలవడమంటే మాటలు కావు. దానికి సరైన దిశా నిర్దేశం ఉండాలి. దానం అందుకు తగిన వ్యక్తి కాదనే అభిప్రాయం కాంగ్రెస్ లో వస్తోంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ సికింద్రాబాద్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందోననే బెంగ అందరిలో రావడం సహజమే. పొలిటికల్ గేమ్ లో దానం తెరమరుగు అవుతారా? లేక పోటీలో నిలుస్తారా? వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News