సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చినప్పుడు ‘ఆంధ్రోడు’ ఏమయ్యాడు?
తెలంగాణ ఉద్యమంలో మూల నినాదమైన విడిపోయి కలిసి ఉందామన్న మాటకు అర్థం లేకుండా చేస్తున్నారని చెప్పాలి. తెలుగువారిగా కలిసి ఉంటూ.. రాష్ట్రాలుగా విడివిడిగా ఉండాలనన వాదన ఇప్పుడేమైంది? అన్నది మరో ప్రశ్న.
రాజకీయాలు వేరు.. ప్రాంతీయవాదాన్ని వినిపిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించే తీరుకు చెక్ పెట్టాల్సిన అవసరం తెలంగాణలో ఎంతైనా ఉంది? విషయం ఏదైనా సరే.. ఆంధ్రోడు.. ఆంధ్రోడు అంటూ విరుచుకుపడే కొందరు నేతలు.. మేధావుల తీరును చూస్తే.. షాకింగ్ గా అనిపించకమానదు.తెలంగాణ ఉద్యమంలో మూల నినాదమైన విడిపోయి కలిసి ఉందామన్న మాటకు అర్థం లేకుండా చేస్తున్నారని చెప్పాలి. తెలుగువారిగా కలిసి ఉంటూ.. రాష్ట్రాలుగా విడివిడిగా ఉండాలనన వాదన ఇప్పుడేమైంది? అన్నది మరో ప్రశ్న.
కేసీఆర్ మొదలు ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ వరకు, మేధావుల పేరుతో ట్యాగులు వేసుకొని విశ్లేషణలు వినిపించే ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం ప్రాంతీయ వాదాన్ని వినిపించటం.. పవన్ ను ఆంధ్రోడిగా అభివర్ణిస్తుంటే.. ఆయన మౌనంగా ఉండటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఒకవేళ పవన్ లో ఆంధ్రోడు నిండుగా కనిపిస్తుంటే.. తెలంగాణ విషయాలపై మాట్లాటంలో అభ్యంతరాలు ఉంటే.. మరి తాము చేసేది ఏంటి? అన్నది మరో ప్రశ్న. ప్రొఫెసర్ నాగేశ్వర్ తనను తాను తెలంగాణకు చెందిన వ్యక్తిగా పరిమితం చేసుకుంటే.. సదరు మేధావికి ఏపీతోనూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం ఏంటి? ప్రాంతాలుగా ఒకలాంటి వాదనలు వినిపించేవేళ.. పొరుగన ఉన్న ఆంధ్రోళ్లకు సంబంధించిన రాజకీయాల గురించి నిత్యం మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న.
పవన్ ను ఆంధ్రోడిగా అభివర్ణించేవారు.. తెలంగాణ గురించి..తెలంగాణ గొప్పతనం గురించి..తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే వేళలో.. నో.. నో.. ఇలాంటివి ఏమైనా చెప్పాల్సింది తెలంగాణ వారే తప్పించి.. ఆంధ్రోళ్లు కాదని అడ్డుకోలేదేం? ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణలోని కొండగట్టు డెవలప్ మెంట్ కు టీటీడీ నుంచి రూ.30 కోట్లు కేటాయిస్తున్నప్పుడు.. ఆంధ్రోళ్లకు చెందిన ఆలయం డబ్బుల్ని తెలంగాణలోని టెంపుల్ కు ఇస్తావా? మేం అంత డబ్బుల్లేని వాళ్లమని అనుకుంటున్నావా? మా గుళ్లను మేం డెవలప్ చేసుకుంటాం? మీరెవరు మాకు డబ్బులు ఇవ్వటానికి? అని ఎందుకు ప్రశ్నించలేదు? అన్నది కూడా ప్రశ్నే.
మేధావులుగా ట్యాగులు వేసుకొని నిత్యం ప్రజలకు హితభోదలు చేసే వారు సైతం ప్రాంతీయవాదాన్ని వినిపించటమే అభ్యంతరకరం. ఆ మాటకు వస్తే రాజకీయంగా మాట్లాడటం తప్పే. తెలంగాణలో అధికారపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మొన్నటికి మొన్న కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేసినట్లు? తెలంగాణ వారు కేరళంలో రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి? మీ రాష్ట్రానికి పోయి మీ రాజకీయం ఏంటో మీరు చేసుకోండని మలయాళీలు ప్రశ్నిస్తే? ప్రాంతీయ పార్టీగా తరచూ ఆంధ్రోళ్లను.. ఆంధ్రా రాజకీయాల్ని చెడుతిట్టే కేసీఆర్ లాంటి అినేత సైతం.. చివరకు తన పార్టీని జాతీయ పార్టీగా మార్చటం.. ఏపీలో తన పార్టీ అఫీసును ఏర్పాటు చేయటం తెలిసిందే.
ఆ వేళలోనూ.. నీకేమైనా బుద్ధి తగ్గిందా? ఆంధ్రోళ్లతో రాజకీయాలేంటి? ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడతావా? అని ఘనత వహించిన రాజకీయ నేతలు మొదలు మేధావుల వరకు ఎందుకు నోరు విప్పలేదు? కేసీఆర్ నిర్ణయాన్ని ఎందుకు తప్పు పట్టలేదు? అన్నది ప్రశ్న. అంతేనా.. సినీ కళాకారుడిగా తెలంగాణ కష్టకాలంలో ఉన్నప్పుడు సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ఇచ్చినప్పుడు పవన్ లోని ఆంధ్రోడు కనిపించలేదా? డబ్బులు ఇచ్చే వేళ.. ప్రాంతీయత గురించి ఆలోచించకుండా ఉండే వారు.. కొన్ని సందర్భాల్లో మాత్రం అవసరం లేని ఆంధ్రా ట్యాగ్ ను ఎందుకు తీస్తున్నారన్నదే అసలు ప్రశ్న.