బీజేపీ-కాంగ్రెస్ డిష్యుం.. డిష్యుం.. ఎక్కడ? ఎందుకు?
కీలకమైన పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఆదివారం(14/12) ప్రశాంతంగా మొదలైంది. తొలిదశ పూర్తి అయిన తర్వాత.. జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రెండో దశ పోలింగ్‌కు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.;
కీలకమైన పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఆదివారం(14/12) ప్రశాంతంగా మొదలైంది. తొలిదశ పూర్తి అయిన తర్వాత.. జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రెండో దశ పోలింగ్‌కు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే.. మెదక్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్-బీజేపీ మద్దతు దారులు బాహాబాహీకి దిగారు. ఎన్నికల పోలింగ్ బూతుల వద్ద ప్రచారం చేస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు.
ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. ఇంతలోనే కాంగ్రెస్ నేతలు..మద్దతు దారులు బీజేపీ మద్దతు దారులపై దాడికి దిగారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఒకరి పై ఒకరు దూషణలకు దిగడంతోపాటు.. పరస్పరం దాడులు చేసుకున్నారు. అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో అధికారులు పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు.. దాడి చేసిన వారిని కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ రెండో దఫా పోరు రూపం!
+ 193 మండలాల్లో రెండో దశ పోలింగ్ జరిగింది.
+ మొత్తం 3వేల, 911 గ్రామ పంచాయతీ సర్పంచుల అదృష్టం తేలనుంది.
+ అలాగే, 29వేల, 917 వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోనున్నారు.
+ 911 సర్పంచ్ పదవులకు గాను 12,782 మంది పోటీలో ఉన్నారు.
+ ఇక, 29 వేల, 917 వార్డు సభ్యుల పదవులకు గాను 71,071 మంది పోటీ చేశారు.
ఎక్కడికక్కడ కట్టుదిట్టం!
రెండో దశ ఎన్నికల పోలింగ్ విషయాన్ని బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తొలి దశలో బీఆర్ ఎస్ వెనుకబడిన నేపథ్యంలో ఇప్పుడు పుంజుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంటింటి ప్రచారానికి సమయం ముగిసిన తర్వాత. కూడా కొందరు ప్రచారం చేయడం గమనార్హం. ఇక, కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు కూడా ఇదే తరహాలో ప్రయత్నించారు. అయితే.. కొన్ని కొన్ని చోట్ల ఘర్షణలకు దారి తీసింది.