జంపింగ్ ఎమ్మెల్యేల ఫేటు ఏమిటి ?
బీఆర్ఎస్ లైన్ దాటి ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి అన్న చర్చ అయితే ఇపుడు ముందుకు వస్తోంది.;
బీఆర్ఎస్ లైన్ దాటి ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి అన్న చర్చ అయితే ఇపుడు ముందుకు వస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం అయితే వారి విషయంలో స్పీకర్ యాక్షన్ తీసుకోవడానికి మూడు నెలల గడువు విధిస్తూ తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఇపుడు బంతి స్పీకర్ కోర్టులో ఉంది మరి స్పీకర్ ఏమి చేస్తారు అన్నదే సర్వత్రా చర్చగా ఉంది.
మూడు నెలలలోగానా :
సుప్రీంకోర్టు మూడు నెలలలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి సూచించింది. స్పీకర్ ఆఫీస్ దీని మీద అధ్యయనం చేస్తుంది అని అంటున్నారు. తెలంగాణా స్పీకర్ అయితే తీర్పు మీద స్పందిస్తూ తాను ఇంకా పూర్తిగా చదవలేదని న్యాయ నిపుణులతో మాట్లాడి ఏమి చేయాలో చూస్తామని అన్నారు మూడు నెలల గడువు అంటే స్పీకర్ పిలిచి అనర్హత ఉన్న ఎమ్మెల్యేల మీద వేటు వేస్తారా అది సాధ్యపడుతుందా అన్న చర్చ వస్తోంది.
స్పీకర్ కే అధికారం :
రాజ్యాంగం ప్రకారం చూస్తే స్పీకర్ కే ఈ విషయంలో అధికారం ఉంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. పది మంది ఎమ్మెల్యేల మీద వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయి వారు కాంగ్రెస్ లోకి వచ్చి ఈ విధంగా ఉప ఎన్నికలు ఎదుర్కోవడం అంటే అది పార్టీకి కూడా ఇబ్బంది. ఇక ఉప ఎన్నికలే వస్తే బీఆర్ఎస్ కే అడ్వాంటేజ్ గా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే వారు జనంలోకి వెళ్ళి ప్రచారం చేస్తారు. తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు అని కాబట్టి వారిని ఓడించమని కూడా పిలుపు ఇస్తారు.
రాజకీయంగా చూడాల్సిందే :
అదే సమయంలో ఏణ్ణర్ధం దాటి రెండవ ఏడాదిఓకి రేవంత్ రెడ్డి పాలన ప్రవేశిస్తోంది. దాంతో యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. కాంగ్రెస్ అంతా ఏకమొత్తంగా పైచేయాల్సి ఉంటుంది. ఒకటీ రెండూ కాదు పది అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు అంటే మినీ సార్వత్రిక ఎన్నికలే. పైగా అన్ని సీట్లూ గెలిస్తే ఓకే లేకపోతే కాంగ్రెస్ కి ఇబ్బంది. దాంతో కాంగ్రెస్ అయితే ఉప ఎన్నికలు కోరుకోదు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి స్పీకర్ అయిన వారు వీరి విషయంలో అనర్హత వేటు వంటి సీరియస్ డెసిషన్ తీసుకుంటారా లేక మరోసారి నోటీసులు విచారణలు అని మూడు నెలలూ గడిపేస్తారా అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట.
సుప్రీం కోర్టు సూచించడమే కానీ స్పీకర్ విషయంలో వేరే విధంగా చేయలేదని స్పీకర్ చెయిర్ కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కావడమే అందుకు కారణం అంటున్నారు. మొత్తానికి చూస్తే అనర్హత వేటు ఆ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద పడుతుందా లేదా అన్నది అయితే చూడాలి ఉంది. ఎందుకంటే ఇది చాలా కీలకమైన మౌలికమైన విషయంగా మారిపోయింది కాబట్టి.