పార్టీ ఫిరాయింపు కేసులో శనివారం నాటి కీలక అప్ డేట్ ఇదే!
అవును... తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం చేపట్టిన విచారణ ముగిసింది.;
మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఎప్పుడూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతూనే ఉంటుంది. గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు.. తాము గెలిచిన పార్టిని వదిలి, అధికార పార్టీ కండువాలు కప్పుకుని, మంత్రి పదవులు సైతం దక్కించుకున్న రాజకీయాలు తెలుగు రాష్ట్రాల సొంతం అని చెప్పినా అతిశయోక్తి కాదు.
అయితే తాజాగా ఈ పార్టీ పిరాయింపుల వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో మరింత సంచలనంగా మారింది. ఇది కాస్తా కేవలం రాజకీయ విమర్శలకు, నైతికత వ్యాఖ్యలకు మాత్రమే పరిమితం కాకుండా సుప్రీంకోర్టు గడప తొక్కడం, సర్వొన్నత న్యాయ్స్థనం సూచనలు చేయడం తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో విచారణలు కొనసాగుతున్నాయి. తాజాగా నేడు చేపట్టిన విచారణ ముగిసింది.
అవును... తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం చేపట్టిన విచారణ ముగిసింది. విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు.. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు.
వాస్తవానికి అక్టోబర్ 1న అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపు నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలను.. వారిపై ఫిర్యాదు చేసిన బీఆరెస్స్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఆ రోజు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్యల విచారణ మాత్రమే పూర్తయింది. ఈక్రమంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ నేడు నిర్వహించారు.
కాగా... బీఆరెస్స్ టికెట్ పై ఎన్నికల్లో గెలిచి.. అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... రోజులు గడుస్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ.. ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాల జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. అయితే.. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన 8 మంది తాము పార్టీ మారలేదంటూ అఫిడవిట్ల పూర్వకంగా సభాపతికి వివరణ ఇచ్చారు. మరోవైపు ఫిర్యాదుదారులు (బీఆరెస్స్ నేతలు) వారికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించారు. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది.