• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మద్యం దుకాణాలకు...

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్.. నాన్ రిఫండబుల్ అమౌంట్ పెంచిన ప్రభుత్వం..!

| ప్రభుత్వం మద్యం దుకాణాలపై సామాజిక న్యాయం సూత్రాన్ని అమలు చేస్తూ, గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది.

By - Tupaki Desk
Update: 2025-09-25 12:23 GMT

తెలంగాణలో వైన్స్ షాపుల కేటాయింపునకు టెండర్లు పిలవనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన వైన్స్ నేటి వరకు కొనసాగాయి. వాటి లైసెన్స్ గడువు తీరడంతో మళ్లీ కేటాయింపు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో మద్యం ప్రియులు ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పండుగలు, శుభకార్యాలలో మధ్యం ఉండాల్సిందే. చుక్క, ముక్క తెలంగాణ స్పెషల్. దీన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెండర్ల రూపంలో కోట్లాది రూపాయలు ఖాజనాలో నింపుకుంటుంది.

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,620 షాపులు ఉండగా.. రేపటి (సెప్టెంబర్ 26) నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 18 దరఖాస్తుల తుది గడువైతే, అక్టోబర్ 23న డ్రా ద్వారా షాపుల కేటాయింపు జరగనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సులు అమల్లోకి వచ్చి, 2027 నవంబర్ 30 వరకు కొనసాగుతాయి. ఒక్కో షాపు టెండర్ ఫీజు రూ. 3 లక్షలు నాన్ రిఫండబుల్‌గా నిర్ణయించడం గమనార్హం.

గౌడ కులస్తులకు 15 శాతం..

ప్రభుత్వం మద్యం దుకాణాలపై సామాజిక న్యాయం సూత్రాన్ని అమలు చేస్తూ, గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇది కొంత మేరకు వెనుకబడిన వర్గాలకు ఆర్థిక అవకాశాలను కల్పించినా.. మద్యం వ్యాపారం ద్వారా వారిని ఆధారపడేలా చేయడం సరికాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లైసెన్సుల కేటాయింపు రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దుకాణాల సంఖ్య పెంచనుందా..?

ప్రభుత్వం ఒకవైపు మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తున్నట్లు చెబుతూనే, మరోవైపు అధిక ఆదాయ ఆశతో దుకాణాల సంఖ్య పెంచడం విరుద్ధ ధోరణి. ఈ నేపధ్యంలో ప్రజా ఆరోగ్యం, ఆర్థిక సమతుల్యత రెండింటినీ దృష్టిలో ఉంచి సమగ్రమైన మద్యం విధానం రూపొందించాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది.

Tags:    
  • TelanganaLiquorTender 
  • WineShopLicense 
  • LiquorShopTender 
  • TelanganaGovt 
  • AlcoholLicense 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS