మంత్రి పై పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో అధికారంలో ఉన్నకాంగ్రెస్ పార్టీలో చిన్నపాటి వివాదాలు చినుకు చినుకు గాలి వానగా మా రిన చందంగా మారుతున్నాయి.;
తెలంగాణలో అధికారంలో ఉన్నకాంగ్రెస్ పార్టీలో చిన్నపాటి వివాదాలు చినుకు చినుకు గాలి వానగా మా రిన చందంగా మారుతున్నాయి. చిన్న విషయాలను.. లేదా అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాల ను కూడా బహిర్గతం చేసుకుని నాయకులు రచ్చకెక్కుతున్నారు. తాజాగా ఓ మంత్రిపై పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఆగ్రహంతో ఊగిపోయారు.
''జాగ్రత్తగా ఉండాలని చెప్పాలా?'' అంటూ మహేష్ గౌడ్ నిప్పులు చెరిగారు. దీంతో తెలంగాణ అధికార పార్టీలో రగడలు రోడ్డున పడ్డట్టయ్యాయి. తాజాగా ఆదివారం మీడియా ముందుకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ నెల చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక ప్రకటన జారీ చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ స్థానికంగా తాము విజయం దక్కించుకుని తీరుతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.
అయితే.. ఇదేసమయంలో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం కాకుండా.. నాయకుల మార్పులు.. చేర్పులు జరుగుతున్న సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రయోజనం ఏంటన్న ది చర్చకు వచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో స్థానిక సంస్థల ఎన్ని కలను హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే.. నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. ఈ విషయంలో మంత్రి పొంగులేటి తొందరపడ్డారు.
ఇక, ఈ వ్యవహారం రచ్చగా మారడంతో తాజాగా పీసీసీ చీఫ్.. మహేష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఏదైనా ఒక విషయంపై మాట్లాడేప్పుడు మంత్రులకు అవగాహన ఉండాలని అన్నారు. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సమజసం కాదని.. కోర్టులో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని అప్పుడే ఎలా డిక్లేర్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రిగా బాధ్యతగా వ్యవహరించాలని కూడా తీవ్రంగా స్పందించారు. భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరి దీనిపై మంత్రి పొంగులేటి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.