ఫోన్ ట్యాప్ చేశారు.. ఇదే సాక్ష్యం.. హరీష్ రావు సంచలన విషయాలు..
ఇటీవల హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పనేనని ఆరోపించాడు.;
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ల ట్యాపింగ్ అంశంపై ఇటీవల కేసు నడుస్తూనే ఉంది. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి, ఓ కీలక అధికారి హస్తం ఉన్నట్లు దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇది తమను అనవసరంగా ఇరికించేందుకే అని ఇందులో తమను దోషులను చేయాలని కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కుట్రలు చూస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ ఫోన్లు ట్యాప్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ వ్యవహారమే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆ పార్టీకి మచ్చను తెచ్చింది. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, అప్పటి బీజేపీ చీఫ్ సంజయ్ ఇద్దరు ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ‘తాము ఎవరితో మాట్లాడుతున్నాం.. తమ ప్రణాళికలు ఏంటి..? ఇంకా భార్య పిల్లలతో మాట్లాడేవి కూడా దొంగతనంగా వింటున్నారు’ అంటూ వారు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ అంశంతోనే బీఆర్ఎస్ కు చెడ్డపేరు వచ్చింది. దీంతో ప్రజలు తమ ఓటును కాంగ్రెస్ వైపు తిప్పడంతో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమయంతో కలిపితే దాదాపు మూడేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ హాట్ గా నడుస్తూనే ఉంది.
ఇటీవల హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పనేనని ఆరోపించాడు. ఆరోపణలే కాదు.. తన వద్ద సాక్షాలు కూడా ఉన్నాయని చెప్పుకచ్చాడు. తాను మాట్లాడుతున్న పర్సనల్, పొలిటికల్ ప్రతీ కాల్ ను వింటున్నారని ఇది తన హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన మండిపడుతున్నారు. మా పార్టీకి సంబంధించి ప్రతీ నేత ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంతో బాధపడుతున్న వారేనని వాపోయారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంలో ఒక రిపోర్టర్ తో మాట్లాడారట.. ‘హరీష్ రావుతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నావంటూ చెప్పడం తనను ఆశ్చర్యానికి గురి చేసింది’ ఆ రిపోర్టర్ నాతో టచ్ లో ఉంటున్న సంగతి సీఎంకు ఎలా తెలుసని, ఇదే ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు సాక్షం అన్నారు.