స్టూడెంట్ కు మందు తాగించి సెక్స్ చేసిన టీచర్ అరెస్టు

విద్యార్థిగా ఉన్న తనతో తన టీచర్ బలవంతంగా సెక్సు చేసిన వైనంపై తాజాగా ఒక బాధితుడు ఆరోపణలు చేయటంతో.. సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ టీచరమ్మను అరెస్టు చేయటం సంచలనంగా మారింది.

Update: 2023-11-09 03:59 GMT

తల్లి.. తండ్రి.. గురువు.. దైవం అంటూ.. కంటికి కనిపించని భగవంతుడి కంటే కళ్ల ముందు ఉండే తల్లిదండ్రుల తర్వాత అంత గౌరవం ఇచ్చింది గురువుకే. విద్యాబుద్దులతో పాటు చక్కటి గుణాల్ని వంట బట్టేలా చేయటంలో టీచర్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటి టీచర్ చెప్పలేనంత దారుణాలకు పాల్పడితే? అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా బయటకు వచ్చి.. పాత పాపానికి 'జైలు' శిక్షగా పడింది. విన్నంతనే.. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అనిపించే ఈ ఉదంతం యూఎస్ లో చోటు చేసుకుంది. విద్యార్థిగా ఉన్న తనతో తన టీచర్ బలవంతంగా సెక్సు చేసిన వైనంపై తాజాగా ఒక బాధితుడు ఆరోపణలు చేయటంతో.. సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ టీచరమ్మను అరెస్టు చేయటం సంచలనంగా మారింది.

మాంట్ గోమెరి విలేజ్ మిడిల్ స్కూల్ లో మెలిసా మేరి కర్టిస్ అనే టీచర్ విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆమె అక్కడ పని చేయట్లేదు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం(2015)లో ఆమె అక్కడ పని చేసే వేళలో.. అక్కడి విద్యార్థితో దారుణంగా వ్యవహరించేవారు. తనతో టీచర్ కర్టిస్ సెక్సు చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం బాధిత వ్యక్తికి 22 ఏళ్లు. తాను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన టీచరమ్మ కర్టిస్ తనతో సెక్సు చేసేదని అతడు తాజాగా పాత విషయాల్ని బయటపెట్టాడు.

Read more!

అప్పట్లో ఆమె వయసు 22 ఏళ్లు అని.. తనను తన టీచర్ ఎలా వాడుకునేదన్న విషయాన్ని బయటపెట్టాడు. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే.. విచారణ చేసి ఆమెను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. బాధిత విద్యార్థికి పలుమార్లు మద్యం తాగించి.. గంజాయి ఇచ్చి తాను సెక్సు చేసిన విషయాన్ని సదరు టీచరమ్మ ఒప్పుకున్నారు. దీంతో.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ఆమె బారిన పడిన బాధితులు ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. పవిత్రమైన గురు - శిష్య సంబంధాన్ని ఇలా చేయటమా? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి.

Tags:    

Similar News