11 లక్షల మంది మహిళల ప్రైవేట్‌ చాట్ లీక్‌... ఏమిటీ యాప్..!

అవును... మహిళలు తమకు నచ్చిన విషయాలు షేర్ చేసుకునేలా రూపొందించిన టీ డేటింగ్ యాప్ లో గోప్యతా ఉల్లంఘనలు బయటపడ్డాయని తెలుస్తోంది.;

Update: 2025-07-29 10:07 GMT

పురుషుల గురించిన సమాచారాన్ని పంచుకోవడానికి, మహిళలకు సురక్షితమైన స్థలాన్ని అందించడానికి ఉద్దేశించినట్లు చెప్పే "టీ" డేటింగ్ యాప్ మరో తీవ్రమైన డేటా ఉల్లంఘనకు గురైందనే విషయం తాజాగా సంచలనంగా మారింది! తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. సుమారు 11 లక్షల మంది మహిళలకు సంబంధించిన అత్యంత వ్యక్తిగత మెసేజ్ లు, సెల్ఫీలు ఆన్ లైన్ లో బహిర్గతమయ్యయి.

అవును... మహిళలు తమకు నచ్చిన విషయాలు షేర్ చేసుకునేలా రూపొందించిన టీ డేటింగ్ యాప్ లో గోప్యతా ఉల్లంఘనలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా... 11 లక్షల మంది యూజర్ల మధ్య జరిగిన ప్రైవేటు మెసేజ్‌ లు ఆన్‌ లైన్‌ లో ప్రత్యక్షమయ్యాయని ఓ మీడియా కథనం పేర్కొంది. వాటిలో అత్యంత వ్యక్తిగతమైన, మరింత సున్నితమైన సమాచారం ఉందని ఆ కథనం వెల్లడించింది.

ఈ సందర్భంగా... తాజా ఉల్లంఘనల్లో 2023 నుంచి ఉన్న మెసేజ్ లు కూడా ఉన్నాయని ఆ కథనం పేర్కొగా.. అందులో కొందరు మహిళలు అబార్షన్‌, రిలేషన్‌ షిప్ సమస్యలను చర్చించుకున్నారని తెలిపింది. ఇక... ఈ యాప్‌ లో నకిలీ పేర్లు వాడే వెసులుబాటు ఉన్నప్పటికీ.. చాలామంది యూజర్లు తమ గుర్తింపు తెలియజేసే వివరాలను ఉపయోగించారని అంటున్నారు.

దానికి ప్రధాన కారణం.. తమ పర్సనల్ ఇష్యూస్ గోప్యంగా ఉంటాయని నమ్మడమే అని అంటున్నారు. ప్రస్తుతం టీ యాప్‌ కు 16 లక్షల మంది యూజర్లు ఉండగా... మహిళలు మాత్రమే ఈ యాప్‌ లో చేరేలా వారి సెల్ఫీలతో కన్ ఫాం చేసుకుంటారు. ఈ ఫీచర్‌ వల్లే మహిళలు దీనిపై ప్రత్యేకంగా ఆకర్షితులయ్యారని చెబుతారు.

అయితే... వరుసగా జరిగిన గోప్యతా ఉల్లంఘనల వల్ల యూజర్ల సమాచారాన్ని భద్రపరిచే సామర్థ్యంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో... ఈ సమస్యను కనుగొన్న సైబర్ సెక్యూరిటీ పరిశోధకురాలు కస్రా రహ్జెర్డి.. యాప్‌ లో వినియోగదారుల పేర్లు ఇప్పటికీ యాక్టివ్‌ గా ఉన్నాయని నిర్ధారించింది.

ఈ నేపథ్యంలో.. ఈ వ్యవహారాలపై ‘టీ’ నిర్వాహకులు స్పందించారు. ఈ సందర్భంగా... ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. ఇదే సమయంలో... సైబర్ సెక్యూరిటీ నిపుణులతోనూ తాము విచారణ చేయిస్తున్నామని.. అలాగే భద్రతా సంస్థలు జరిపే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News