చంద్రబాబు...పవన్.. వాటే అండర్ స్టాండింగ్ బ్రో...!
మొత్తానికి చూస్తే పొత్తులు లేకపోయినా మంచి అవగాహన ఇద్దరి మధ్యనా ఉందని అంటున్నారు ఇద్దరూ ఒకరిని ఒకరు అసలు విమర్శించుకోవడంలేదు;
చంద్రబాబు టీడీపీ అధినేత. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఈ ఇద్దరివీ వేరు వేరు పార్టీలు. ఈ రోజు దాకా చూస్తే రెండు పార్టీల మధ్య పొత్తులు అయితే లేవు. బీజేపీతో మాత్రమే జనసేనకు పొత్తు ఉంది. కానీ పవన్ చంద్రబాబు ఇప్పటికి మూడు సార్లు బాహాటంగా కలిసారు. ఒకసారి విజయవాడలో ఒక హొటల్ లో ఈ ఇద్దరి తొలి భేటీ జరిగితే హైదరాబాద్ లోకి చంద్రబాబు నివాసంలో రెండు సార్లు పవన్ స్వయంగా వెళ్లి బాబుతో చర్చించారు
ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ మీడియాకు చెప్పినది ఏంటి అంటే ఏపీలో వైసీపీ అప్రజాస్వామిక విధానాలను ఎదుర్కోనేందుకు కలసికట్టుగా పనిచేస్తామని. పొత్తులు అన్నవి ఇపుడు కాదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే పొత్తులు అన్నవి లేకపోయినా తెర వెనక అనుబంధం మాత్రం బ్రహ్మాండంగా సాగుతోంది అని అంటున్నారు.
పవన్ కి ఏమైనా అయితే చంద్రబాబు వెంటనే రియాక్ట్ అవుతున్నారు అలాగే బాబు విషయంలో పవన్ కూడా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. బ్రో సినిమా విషయంలో మంత్రి అంబటి రాంబాబు పవన్ని టార్గెట్ చేస్తే చంద్రబాబు దాని మీద కౌంటర్ ఇచ్చారు. మంత్రి బ్రో సినిమా పంచాయతీలో బిజీగా ఉన్నారని సెటైర్లు వేశారు. ఇక పుంగనూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ ఘర్షణ జరిగితే ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోంది అని ఒక ఘాటు ప్రకటనను పవన్ జనసేన ప్రెసిడెంట్ గా రిలీజ్ చేశారు.
ఇక అసలు విషయానికి వస్తే పవన్ వారాహి యాత్ర ఏపీలో సాగుతున్నపుడు చంద్రబాబు ఎంచక్కా మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసులో కూర్చుంటారు. పార్టీ వారితో సమీక్షలు సమావేశాలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తారు. అదే చంద్రబాబు జిల్లా టూర్లు ఉంటే పవన్ కూడా ఉంటే సినిమా షూటింగ్స్ లేకపోతే మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసులో ఉంటూ సమీక్షలు పార్టీ నేతలతో మీటింగ్స్ పెడుతూ ఉంటారు.
ఇది భలేగా ఉంది కదూ అని అంతా అనుకునేలా ఈ అనుబంధం అనధికారికంగా సాగుతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు విమర్శలు చేస్తే చంద్రబాబు నుంచి టీడీపీ మాజీ మంత్రులు సహా అంతా ఖండిస్తూంటారు. ఈ మధ్య పవన్ వాలంటీర్ల మీద చేసిన కామెంట్స్ మీద ప్రభుత్వం కోర్టుకు వెళ్తుందని వార్తలు రాగానే బాబు సహా అంతా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అలాగే బాబు విషయంలో ఏమి జరిగినా పవన్ వెంటనే రంగంలోకి వస్తున్నారు.
మొత్తానికి చూస్తే పొత్తులు లేకపోయినా మంచి అవగాహన ఇద్దరి మధ్యనా ఉందని అంటున్నారు ఇద్దరూ ఒకరిని ఒకరు అసలు విమర్శించుకోవడంలేదు. ఇద్దరి ఫోకస్ జగనే. ఇద్దరూ వైసీపీ పాలన మీదనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అయితే జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తారు పవన్ అధికారంలో లేరు కాబట్టి ఏమీ అనలేరు అనుకున్నా పవన్ సైతం కేవలం జగన్ నాలుగేళ్ళ పాలన మీదనే విమర్శలు చేస్తూ అక్కడితో సరిపెట్టడమే టీడీపీతో అవగాహన ఉందన్న అనుమానాలు కలిగిస్తున్నాయని అంటున్నారు.
అన్నింటికంటే మరో కీలక విషయం ఏంటి అంటే ఆగస్ట్ 1 నుంచి 10 వరకూ చంద్రబాబు ఏపీలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో ఏపీలోని జిల్లాలలో టూర్లు చేస్తున్నారు 10వ తేదీతో చంద్రబాబు జిల్లా టూర్లు ఆగిపోతే అదే రోజు నుంచి పవన్ కళ్యాణ్ విశాఖలో వారాహి రధమెక్కి జనాల్లోకి వస్తున్నారు. పవన్ యాత్ర ఆగస్ట్ 19 దాకా సాగనుంది. ఆ టైం లో చంద్రబాబు టూర్లు ఉండవని ఈ ఇద్దరి రాజకీయాల మీద అవగాహన ఉన్నవారు ఇట్టే చెప్పేయవచ్చు అంటున్నారు. మొత్తానికి చూస్తే వాటే అండర్ స్టాండింగ్. వాటే గ్రేట్ బంధం అని వైసీపీ నుంచి సెటైర్లు అయితే ఈ ఇద్దరి గురించి గట్టిగానే పడుతున్నాయి.