అప్పుడే అమ్మవైతే..ఇక అక్కా చెల్లే గతి!
మీనాక్షి చౌదరి కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయమై? స్టార్ హీరోలకు ప్రమోట్ అయింది.;
మీనాక్షి చౌదరి కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయమై? స్టార్ హీరోలకు ప్రమోట్ అయింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ డీసెంట్ రోల్స్ తోనే అలరిస్తుంది. కానీ నటిగా మాత్రం అమ్మడు స్టార్స్ సరసన సెకెండ్ లీడ్స్ వరకే పరిమితమవుతుంది. ట్యాలెంటెడ్ బ్యూటీ అయినా? నటిగా మాత్రం బిజీ అవ్వలేకపోతుంది. `సంక్రాంతి కి వస్తున్నాం`తో? 300 కోట్ల విజయాన్ని అందుకున్నా ఆ క్రేజ్ తో ఛాన్సులు అందుకోవడంలో విఫలమైంది.
ఇటీవలే రిలీజ్ అయిన `అనగనగా ఒక రాజు`తో మరో హిట్ అందుకుంది. మరి ఈ విజయం అమ్మడికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో మీనాక్షి స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు వచ్చినా నటించే పరిస్థితి లేదని తెలుస్తోంది. అమ్మ పాత్రల్లో నటించకూడదని అమ్మడు సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇది తన స్వీయా నిర్ణయం కాదు. స్నేహితులు సూచించడంతోనే అమ్మ పాత్రలకు దూరమవుతున్నట్లు తెలిపింది.
కెరీర్ ప్రారంభ దశలోనే ఇలాంటి పాత్రలు చేస్తే వాటికే పరిమితమయ్యే ప్రమాదం ఉందని స్నేహితులు హెచ్చరించారంది.
ఈ సందర్భంగా `లక్కీ భాస్కర్` అనుభవాన్ని పంచుకుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి దుల్కర్ సల్మాన్ కు భార్య పాత్ర పోషించింది. మధ్య తరగతి కుటుంబ మహిళ పాత్రలో విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ అదే పాత్ర తన కెరీర్ ఎదుగుదలను అడ్డుకుంటుందని అమ్మడు భావిస్తోంది. 28 ఏళ్ల వయసులోనే అమ్మ పాత్రలు..భార్య పాత్రలు పోషిస్తే? భవిష్యత్ లో ప్రియురాలి పాత్రలకు ప్రమాదం ఉందని సొగసరి ఆందోళన వ్యక్తం చేసింది. అక్క పాత్రలకు, వదిన పాత్ర లతోనే కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తుందేమోనని సందేహం వ్యక్తం చేస్తోంది.
`లక్కీ భాస్కర్` లో తల్లి పాత్ర నచ్చడంతోనే అంగీకరించానని తెలిపింది. మరి భవిష్యత్ మీనాక్షి అనుకున్న విధంగా సాగుతుందా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు తెరకెక్కిస్తోన్న మిస్టికల్ థ్రిల్లర్ వృషకర్మలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. `విరూపాక్ష` తర్వాత కార్తీక్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడం సహా `తండేల్` హిట్ అనంతరం నాగ చైతన్య నటిస్తోన్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విజయంపై మీనాక్షి చాలా కాన్పిడెంట్ గా ఉంది. ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ లు సక్సెస్ అయితే మీనాక్షి కొత్త అవకాశాలు ఛాన్స్ ఉంటుంది.