మహిళలకు 33 శాతం...తమ్ముళ్ల సంగతేంటి ?

దాంతో 2029 లో మహిళలకు టీడీపీలో మొత్తం సీట్లలో మూడవ వంతు వెళ్ళనున్నాయని అంటున్నారు.

Update: 2026-05-29 02:30 GMT

ఏపీలో టీడీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది మహిళా పక్షపాత వైఖరిని తీసుకుంది. ఏపీలో సరికొత్త రాజకీయ విప్లవంగా చెబుతున్నారు. నిజానికి ఈ నిర్ణయం పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా వస్తే ఇబ్బంది ఉండదు, అయితే ఏప్రిల్ నెలలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దీని మీద లోక్ సభలో బిల్లు ప్రవేశపెడితే వీగిపోయింది అయితే ఆ బిల్లుని మరోసారి ప్రవేశపెట్టాలని ఎన్డీఎలో కీలక భాగస్వామి అయిన టీడీపీ కోరుతోంది. అదే సమయంలో మహిళల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకునేందుకు మహానాడులో ఏకంగా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేసి ఇస్తామని పేర్కొంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దీనిని ప్రతిపాదించగా అధ్యక్షుడు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.

బిల్లు రాకపోతే :

దాంతో 2029 లో మహిళలకు టీడీపీలో మొత్తం సీట్లలో మూడవ వంతు వెళ్ళనున్నాయని అంటున్నారు. అయితే పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం పొందకపోతే అదే విధంగా ప్రస్తుతం ఉన్న 175 సీట్లు మరింతగా పెరగకపోతే అపుడు ఈ మూడవ వంతు రిజర్వేషన్లు మహిళలకు అమలు చేయడం కత్తి మీద సాము అవుతుంది కదా అన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఎందుకంటే టీడీపీతో పాటు కూటమిలో జనసేన బీజేపీలకు కూడా సీట్లు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. 2024 లో కంటే 2029 లో ఎక్కువ సీట్లు పోటీ చేయాలని కూడా మిత్ర పక్షాలు భావించడం సహజం. ఆ విధంగా చూస్తే అప్పట్లో 31 సీట్లు ఇచ్చారు. అవి కాస్తా ఏ 50 సీట్లకో పెరిగి మిత్రులకు పోతే మిగిలిన 125 సీట్లలోనే మూడవ వంతు అంటే 42 దాకా ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. అపుడు తమ్ముళ్ళకు మిగిలేవి అక్షరాలా 83 సీట్లు మాత్రమే అని అంటున్నారు.

పోటీ తీవ్రతరం :

2024 ఎన్నికల్లో పోత్తు కారణంగా పోటీకి దూరంగా ఉన్న వారు త్యాగరాజులు అనేక మంది తమ్మ్ముళ్లు ఉన్నారు. వారంతా వచ్చే ఎన్నికల మీద కోటి ఆశలను పెట్టుకుని పనిచేస్తున్నారు. వారికి సీట్లు దక్కకపోతే ఎలా అన్న చర్చ సాగుతోంది. అయితే మహిళా రిజర్వేషన్ అంటే అదే ఆశావహుల ఇంట్లో ఉన్న మహిళలకు కూడా ఇచ్చే చాన్స్ ఉంటుంది కదా ఆ విధంగా వారు పోటీ చేయకపోయినా సర్దుబాటు అవుతుంది కదా అన్నది కూడా ఉంది. కానీ చాలా చోట్ల మహిళా అభ్యర్ధులు ఆశావహుల ఇళ్ళలో ఉండకపోవచ్చు అపుడు పరిస్థితి ఏంటి అంటే త్యాగం చేయడమే అన్నది కూడా ఉంది. అయితే టీడీపీ వర్గాలలో వినిపిస్తున్న దాని ప్రకారం చూస్తే కనుక వచ్చే ఎన్నికల నాటికి సీట్లూ పెరుగుతాయి, మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదం పొందుతుంది అని. వాటి మీద పూర్తి ధీమా ఉండబట్టే టీడీపీ అందరి కంటే ముందే ఈ హామీ ఇచ్చి మహిళా పక్షపతిగా క్రెడిట్ తీసుకుంటోంది అని అంటున్నారు.

Tags:    

Similar News