నాలుగు దశాబ్దాల తరువాత ఎగిరిన టీడీపీ జెండా !

ఎట్టకేలకు విశాఖ కార్పోరేషన్ మీద టీడీపీ జెండా ఎగిరింది. దీంతో నాలుగు దశాబ్దాల టీడీపీ కల నెరవేరింది.;

Update: 2025-04-19 07:14 GMT

ఎట్టకేలకు విశాఖ కార్పోరేషన్ మీద టీడీపీ జెండా ఎగిరింది. దీంతో నాలుగు దశాబ్దాల టీడీపీ కల నెరవేరింది. ఇప్పటికి 37 ఏళ్ళ క్రితం విశాఖ కార్పోరేషన్ ఏర్పాటు అయితే టీడీపీ ఒకే ఒక మారు గెలిచింది. 1987లో టీడీపీ తరఫున మేయర్ గా డీవీ సుబ్బారావు గెలిచారు.

ఆ తరువాత మళ్ళీ గెలుపు పిలుపు ఆ పార్టీ వినలేదు. 2005లో కార్పోరేషన్ కాస్తా మరిన్ని వార్డులతో కలుపుకుని గ్రేటర్ గా పదోన్నతి చెందింది. ఆ తరువాత 2007లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కార్పోరేషన్ లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయినా ఆనాడు వైఎస్సార్ ప్రభుత్వం ఇండిపెండెట్ల మద్దతు కూడగట్టి కాంగ్రెస్ మేయర్ ని గెలిపించారు.

అలా టీడీపీకి రెండో చాన్స్ తప్పింది 2012లో ఆ కార్పోరేషన్ పదవీకాలం పూర్తి అయింది. 2014లో టీడీపీ గెలిచినా కార్పోరేషన్ ఎన్నికలు జరిపించలేదు. ఆనాడు జరిపించి ఉంటే టీడీపీ బంపర్ మెజారిటీతో గెలిచేది. అదిగో ఇదిగో అని టీడీపీ కాలయాపన చేసింది. ఈలోగా 2019లో ఓటమి సంభవించి టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.

ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2021లో ఎన్నికలు జరిపించి తనకు ఉన్న అధికారాన్ని అన్ని శక్తులను ఉపయోగించి జీవీఎంసీ పీఠాన్ని గెలుచుకుంది. ఇక పురపాలక చట్టంలో అవిశ్వాసం నాలుగేళ్ల పాటు పెట్టరాదు అని చేసిన సవరణల కాలంగా నాలుగేళ్ళ పాటు వైసీపీ మేయర్ పీఠం మీద ఉండగలిగింది. ఈ ఏడాది మర్చితో ఆ గడువు పూర్తి కావడంతో టీడీపీ కూటమి అవిశ్వాసం పెట్టి మరీ వైసీపీని ఓడించింది.

అలా దాదాపుగా నాలుగు దశాబ్దాల తరువాత జీవీఎంసీ పీఠం టీడీపీ పరం అయింది. టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్ కొత్త మేయర్ కాబోతున్నారు. ఆయన ఫ్లోర్ లీడర్ గా కార్పోరేషన్ లో నాలుగేళ్ళ పాటు పనిచేశారు. నిజానికి 2021లో టీడీపీ గెలిస్తే ఆయనకే చాన్స్ ఇవ్వాల్సి ఉంది. ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు. ఇపుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు

ఇదిలా ఉంటే శనివారం ఉత్కంఠగా సాగిన జీవీఎంసీ అవిశ్వాసం మీద సమావేశంలో మేయర్ ని దించడానికి అవసరం అయిన 74 మంది కార్పోరేటర్ల మద్దతు కూటమికి దక్కింది. దాంతో చాలా ఈజీగా అవిశ్వాసం నెగ్గింది. జీవీఎంసీలో మారిన బలాబలాలను చూస్తే కనుక ఇలా ఉన్నాయి.

అధికార టీడీపీకి 49 మంది, వైసీపీకి 30 మంది, జనసేనకు 14 మంది, బీజేపీకి 2, సీపీఐకి 1, సీపీఎంకి 1 ఉన్నారు. మొత్తం జీవీఎంసీలో 98 కార్పోరేటర్లు ఉండగా ఒక సీటు ఖాళీగా ఉంది. మేయర్ ని దించడానికి మూడింట రెండు వంతులు మెజారిటీ ఉండాలి. దాంతో అవసరమైన 74 మంది కార్పోరేటర్ల మద్దతుని కూటమి సాధించింది. అలా జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి పరం అయిపోయింది.

Tags:    

Similar News