కాక్రోచ్ జనతా పార్టీ- టీడీపీ రియాక్షన్ ఇంట్రెస్టింగ్ !

ఈ రోజున దేశాన్ని కుదిపేస్తున్నది కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ప్రభంజనం. ఆ పార్టీ ఆన్ లైన్ లో ఉంది.

Update: 2026-05-25 03:41 GMT

ఈ రోజున దేశాన్ని కుదిపేస్తున్నది కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ప్రభంజనం. ఆ పార్టీ ఆన్ లైన్ లో ఉంది. ఆఫ్ లైన్ లో లేదు అని అంటున్న వారు ఉన్నారు ఇతర దేశాల నుంచి ఫాలోవర్స్ ఉన్నారు తప్ప భారత దేశీయులు ఎక్కడా లేరని వాదిస్తున్న వారూ ఉన్నారు విపక్షాలు అయితే పాలక పక్షం మీద సంధించిన ఒక అస్త్రం కాక్రోచ్ జనతా పార్టీ అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఎన్డీయే వ్యతిరేక శిబిరం అయితే ఇది పాలక పక్షం మీద తీరని అసంతృప్తి అంటోంది. మరి ఎన్డీయేకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ నేతలు మాత్రం ఇవన్నీ కానే కాదు అని ఖండిస్తున్నారు.

టీడీపీ రియాక్షన్ ఇదే :

ఈ నేపథ్యంలో ఎన్డీయేలో కీలక భాగస్వామి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ అయిన టీడీపీ ఈ విషయంలో ఏమి అంటోంది అన్నది అందరికీ ఆసక్తికరమే. కాక్రోచ్ జనతా పార్టీ మీద అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. ఇది ఇది యువత నిరాశ, ఆకాంక్షలకు ప్రతిబింబం అంటూ ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిని లైట్ గా తీసుకోవాల్సింది ఏమీ లేదని పాలకులు అంతా సీరియస్ గానే చూడాలని పల్లా చెప్పిన మాటలు చేసిన వ్యాఖ్యలు అయితే ఇపుడు వైరల్ అవుతున్నాయి.

కొట్టిపారేయలేమంటూ :

ఏదో వ్యంగ్యానికో లేక హాస్యానికో పుట్టిన ఉద్యమం గా కాక్రోచ్ పార్టీ ని చూడాల్సిన అవసరం లేదని పల్లా అంటున్నారు. ఈ ఆన్ లైన్ ఉద్యమం యువతలో నెలకొన్న అసలైన కోరికలు. అలాగే ఉపాధి, ఉద్యోగాల విషయంలో వారికున్న సందేహాలు, నిరాశ నిస్పృహలకు సీజేపీకి ఇస్తున్న మద్దతు అన్నది అద్దం పడుతోందని ఆయన కరెక్ట్న్ గానే అభిప్రాయపడ్డారు. దీనిని ఏ మాత్రం లైట్ తీసుకోవడానికైతే లేదని ఆయన అన్నారు. అంతే కాదు విధాన రూపకర్తలు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశంగా పల్లా చెప్పడం విశేషం.

పాలకులు సమీక్ష చేయాలి :

యువత ఆలోచనలు వారి కోరికలు వారి అంచనాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తమ విధానాలతో సరి పోల్చుకుంటూ సమీక్ష చేసుకోవాల్సిన అవసరాన్ని పల్లా చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన కేంద్రంలో ప్రధాని మోడీ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు ఉద్యోగావకాశాలను అందించేందుకు కృషి చేస్తున్నారని కూడా అన్నారు. ఆర్థిక అభివృద్ధికి డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో కేంద్రం అలాగే ఉద్యోగాల కల్పనలో ఏపీ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోందని పల్లా అన్నారు. మోడీ బాబు వరకూ చూస్తే యువత ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అని ఆయన చెప్పడం గమనార్హం.

యువతకు కూడా సూచన :

ఇదిలా ఉంటే ఆన్ లైన్ వేదికల మీద ఉద్యమాలు అలాగే చర్చల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని కూడా పల్లా కోరారు. యువత ఆవేశాన్ని బయట శక్తులు సొమ్ము చేసుకోకుండా దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. మొత్తానికి చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పుట్టింది దాని ఆకాంక్షలు ఏమిటి అన్నది టీడీపీ అధ్యక్షుడు బాగానే గుర్తించారు అని అంటున్నారు.

Tags:    

Similar News