బాబు ఆలోచన ఒకటి.. నేతలు చేస్తోంది మరొకటి.. !
జగన్ ప్రమాదకర నాయకుడని.. ప్రభుత్వం మంచి చేస్తున్నా.. వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని చంద్రబా బు చెబుతున్నారు.;
ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నది ఒకటైతే.. నాయకులు చేస్తున్నది మరొకటా? చంద్రబాబు ఆలోచన, ఆయన వ్యూహాలను నాయకులు అందిపుచ్చుకోలేకపోతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోం ది. ప్రస్తుతం రాజకీయాల్లో చూసి రమ్మంటే కాల్చి వచ్చే నాయకులు పెరిగిపోయారు. అయితే.. ఇది అన్ని వేళలా రాజకీయాలను సక్సెస్ చేయదు. ఈ విషయాన్ని తెలుసుకునే అంశంలోనే టీడీపీ మంత్రులు, నాయకులు కూడా వెనుకబడుతున్నారు. ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నారు.
ఈ కార్యక్రమం లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ఏడాది కాలంలో రాష్ట్ర సర్కారు అందించిన సంక్షేమం, చేసిన పనులు, తీసుకువస్తున్న పెట్టుబడులు, రాష్ట్రంలో పెరుగుతున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రజలకు వివరించాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక, ఇది జరుగుతున్న క్రమంలోనే మంత్రులను ఆయన హెచ్చరించారు. మీరు జగన్‌పై పన్నెత్తు మాట కూడా అనడం లేదన్నారు.
జగన్ ప్రమాదకర నాయకుడని.. ప్రభుత్వం మంచి చేస్తున్నా.. వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. దీనిని బలం ఎదుర్కొనాలని.. చెబుతున్నారు. అంటే..ఇది వేరే సబ్జెక్టు. కానీ.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు చెప్పింది ఎలా అర్ధమైందో కానీ.. వీరు ఈ రెండు అంశాలను కూడా కల గా పులగం చేసేస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు.. ప్రభుత్వం చేసిన మంచిని వివరించాల్సి ఉన్నా.. దాని కంటే.. జగన్‌ను విమర్శించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
అది కూడా కొత్తగా జగన్‌పై పెద్ద విమర్శలు ఏమీ చేయడం లేదు. అన్నీ పాతవే. మంత్రుల నుంచి ఎమ్మె ల్యేల వరకు కూడా అందరూ.. ఇదే పని చేస్తున్నారు. జగన్‌ను తిట్టడమే రాజకీయం అన్నట్టుగా వ్యాఖ్యలు కుమ్మేస్తున్నారు. దీనివల్ల.. చంద్రబాబు ఆశించింది నెరవేరడం లేదు. ప్రజలకు మంచి వివరించడంలో నూ.. జగన్‌పై కొత్తగా విమర్శలు చేయడంలోనూ.. నాయకులు గాడి తప్పుతున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఆలోచనలను వారు పంచుకోలేక పోతున్నారు. ఏపనికి ఆ పని చేయాలన్న స్పృహను కూడా వారు మరిచిపోతున్నారు. దీంతో ఏపీలో ఒక రాజకీయ అసమతౌల్యం అయితే.. నెలకొందని అంటున్నారు పరిశీలకులు.