లోక్ సభలో రేర్ సీన్.. పల్నాడు ఎంపీ ప్రశ్నకు.. గుంటూరు మంత్రి ఆన్సర్

లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య చోటు చేసుకున్న సంభాషన తెలుగోళ్లను టచ్ చేసేలా మారింది.;

Update: 2025-12-04 03:49 GMT

లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య చోటు చేసుకున్న సంభాషన తెలుగోళ్లను టచ్ చేసేలా మారింది. పల్నాడుకు చెందిన టీడీపీ ఎంపీ ప్రశ్నిస్తే.. అదే పార్టీకి చెందిన గుంటూరు మంత్రి సమాధానం ఇచ్చారు. లోక్ సభలో ఇలాంటి సన్నివేశాలు అరుదుగా చెప్పాలి. ఒకే ప్రాంతానికి చెందిన ఒకే పార్టీకి చెందిన నేతలు ప్రశ్నించే పరిస్థితుల్లోనూ.. జవాబు ఇచ్చే పొజిషన్ లో ఉండటం అప్పుడప్పుడు మాత్రమే చోటు చేసుకుంటుంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

తెలుగుదేశం పార్టీకి చెందిన పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయులు ఒక ప్రశ్నను సంధించారు. తన నియోజకవర్గం పరిధిలోని గిరిజన గ్రామాలకు 4జీ నెట్ వర్కు ఎప్పుడు అనుసంధానం చేస్తారు? అని అడగ్గా.. అందుకు టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ.. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. నెట్ వర్కు లేని ప్రాంతాల్లో 27 వేల 4జీ నెట్ వర్కు టవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. ఆ ప్రాంతాలు మారుమూల ఉండటం..పర్యావరణ.. అటవీ అనుమతుల సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు.

ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న వాస్తవ సమస్య గురించి తెలుసుకోవటానికి తాను ప్రతి ఎంపీకి లేఖ రాశానని.. దీని ద్వారా స్థానిక ఎంపీ.. బీఎస్ఎన్ఎల్ కలిపి పని చేసి నెట్ వర్క్ ఏర్పాటు వేగవంతం అవుతుందన్నారు. అన్ని సమస్యల్ని పరిష్కరించి వేగంగా నెట్ వర్క్ ఏర్పాటు చేసేందుకుప్రయత్నిస్తానని చెప్పారు. అంతేకాదు.. ‘పల్నాడు నా సొంత ప్రాంతం.ఆ ప్రాంతం కోసం పని చేయటం నాకెంత్ సంతోషం’ అని వెల్లడించారు. ఇలా ఇద్దరి నేతల మధ్య నడిచిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. అందరిని ఆకర్షించింది.

Tags:    

Similar News