అవును.. ఆ మంత్రులిద్దరూ కలిసిపోయారు!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకుచెందిన వారిలో ఇద్దరు మంత్రులు వేర్వేరు పార్టీలకు చెందిన వారు ఉన్నారు. నిన్నటి వరకు వారు ఎవరికి వారుగా పనులు చేసుకున్నారు.ఎవరికి వారుగానే ఉన్నారు.;
కూటమి ప్రభుత్వంలో 25 మంది మంత్రులు ఉంటే.. వీరిలో జనసేన, బీజేపీ నుంచి కూడా మంత్రులు ఉన్నారు. అయితే.. ఎవరి సిద్ధాంతాలు వారివి.. ఎవరి పార్టీలైన్లు వారివి. ఈ క్రమంలో మంత్రులుగా ఉన్న ప్పటికీ.. కలివిడి మాత్రం లేకుండా పోయింది. అయితే.. జనసేన-టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు మాత్రం కలిసిపోయారని తెలిసింది. ఈ వ్యవహారం పార్టీల్లోనూ మంత్రివర్గంలోనూ చర్చకు వచ్చింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకుచెందిన వారిలో ఇద్దరు మంత్రులు వేర్వేరు పార్టీలకు చెందిన వారు ఉన్నారు. నిన్నటి వరకు వారు ఎవరికి వారుగా పనులు చేసుకున్నారు.ఎవరికి వారుగానే ఉన్నారు. దీంతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం ఏర్పడుతోందన్న చర్చ జోరుగా సాగింది. అంతేకాదు.. ఎవరికి వారు తమ తమ శాఖలకే పరమితం అయ్యారు. ఈ పరిణామాలు.. పార్టీలోనూ.. చర్చకు దారితీశాయి.
ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహణ విషయంలోనూ కొన్నికొన్ని జిల్లాల్లో మంత్రులు కలిసి రాలేదు. ఇది మరింత ఇబ్బందిగా మారి.. సదరు కార్యక్రమం కూడా పెద్దగా ఫోకస్ కాలేదు. దీనిపై మంత్రివర్గంలోనూ చర్చకు వచ్చింది. మంత్రులు కలివిడిగా ఉండాలని.. మీరే కలివిడిగా లేకపోతే.. ఎలా? అంటూ.. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు మంత్రులకు క్లాస్ ఇచ్చారు. ఇకపై ఇలా చేస్తే ఊరుకునేది కూడా లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఈ పరిణామాల తర్వాత.. ఎక్కడ ఎవరు కలిసి పనిచేస్తున్నారో తెలియదు కానీ.. తూర్పులో మాత్రం ఇద్దరు మంత్రులు కలిసిపోయినట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి కార్యక్రమాలకు హాజరు కావడం.. ప్రభుత్వం తరఫు న పనులు చేసేందుకు రెడీ కావడం వంటివి కూటమి సర్కారులో చర్చగా మారింది. అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు ఇద్దరూ కలివిడిగా ఉండడం కూడా.. పార్టీలలోనూ చర్చకు దారి తీసింది. దీనివల్ల ప్రజలకు సరైన సంకేతాలు వెళ్తాయని అంచనా వేస్తున్నారు.