షాడో నేతలతో జనసేనకు తలనొప్పులు.. !
అక్కడే ఎక్కువగా పార్టీలో వివాదాలు కొనసాగుతున్నాయన్నది పార్టీకి అందిన సమాచారం. బయటకు వెలుగు చూస్తున్న కొన్ని విషయాలు ఉంటే.. వెలుగు చూడనివి మరికొన్ని ఉన్నాయి.;
షాడో నేతలు.. ఇప్పటి వరకు టీడీపీలో మాత్రమే ఈ మాట వినిపించేది. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసి న వారు.. సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలకు షాడోలుగా మారి.. సొంత నిర్ణయాలు తీసుకుని.. నియోజక వర్గాల్లో చక్రం తిప్పారు. దీంతో టీడీపీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీటిని సరిచేసేందుకు.. సీఎం చంద్ర బాబు నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయినా.. చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఇబ్బందులు తప్పడం లేదన్నది తెలిసిందే.
ఇదిలావుంటే.. ఇప్పుడు కీలకమైన కూటమి పార్టీ జనసేనలోనూ.. ఇదే తరహాలో షాడో నాయకులు రెచ్చి పోతున్నారు. మొత్తంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన విజయం దక్కించు కున్న విషయం తెలిసిందే. అయితే.. సుమారు 8 నియోజకవర్గాల్లో షాడో నేతలు హల్చల్ చేస్తున్నారని పా ర్టీ అధిష్టానానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు అందాయి. వీటిలో ఒక ఎంపీ సీటు కూడా ఉండడం గమ నార్హం. ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో జనసేన ఎక్కువ స్థానాలు దక్కించుకుంది.
అక్కడే ఎక్కువగా పార్టీలో వివాదాలు కొనసాగుతున్నాయన్నది పార్టీకి అందిన సమాచారం. బయటకు వెలుగు చూస్తున్న కొన్ని విషయాలు ఉంటే.. వెలుగు చూడనివి మరికొన్ని ఉన్నాయి. చిత్రం ఏంటంటే.. ఉత్తరాంధ్రలోని రెండు కీలక నియోజకవర్గాల్లో జనసేన నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట.. టీడీపీ నాయకులు చక్రంతిప్పుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇక, శ్రీకాళహస్తి వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని మరో కీలక నియోజకవర్గంలోనూ ఇలానే ఉంది.
ఇక, పిఠాపురంలో పరిస్థితి సజావుగానే ఉందని అంటున్నా.. అంతర్గతంగా మాత్రం వివాదాలు కొనసాగు తూనే ఉన్నాయి. అంతర్గతంగా ఇరు పార్టీల నాయకుల మధ్య కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆధిపత్య రాజకీయాలు.. పనులు జరగకపోవడం.. అధికారులపై పెత్తనం వంటి కీలక విష యాల్లో షాడో నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నది వాస్తవం. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం వరకు వచ్చినా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మరి భవిష్యత్తులో అయినా.. సమస్యలు పరిష్కరిస్తారో లేదో చూడాలి.