తమ్ముళ్లూ.. ఇక, పదండి: బాబు టార్గెట్
పదండి ముందుకు .. పదండి తోసుకు.. పదండి! అన్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సీఎం చంద్రబాబు టార్గె ట్లు విధించారు.;
పదండి ముందుకు .. పదండి తోసుకు.. పదండి! అన్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సీఎం చంద్రబాబు టార్గెట్లు విధించారు. జూలై 1 నుంచి రెండు మాసాల పాటుప్రజల మధ్య ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తు న్న సేవలు, చేస్తున్న సంక్షేమం, ఇస్తున్న పథకాలు.. పనితీరుఇలా.. అన్ని కోణాల్లోనూ ప్రజలకు వివరించాలని ఆయన పేర్కొ న్నారు. దీనిలో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా భాగస్వాములు కావాలని ఆదేశించారు. ఒక్క కేంద్ర మంత్రులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక వెబ్ సైట్‌ను రూపొందిస్తున్నామన్నారు.
ప్రజల మధ్యకు వెళ్లే.. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ.. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను.. వివరించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు.. గత ఐదేళ్ల పాలనకు.. ప్రస్తుత కూటమి పాలనకు మధ్య తేడాలను చూపించాలని పేర్కొన్నారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పేర్కొనాలని తమ్ముళ్లకు తేల్చి చెప్పారు. ప్రధానంగా గత ఏడాది కాలంలో ప్రజలకు జరిగిన లబ్ధి, వారు పొందుతున్న పథకాలు, సంక్షేమంపై ఆధారపడిన కుటుంబాలు.. ఇలా అన్ని వివరాలను తెలుసుకోవాలని నిర్ణయించారు. దీని ఆధారంగానే ఎమ్మెల్యేలకు మార్కులు ఉంటాయన్నది ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న చర్చ.
ఇప్పటి వరకు చంద్రబాబు అనేక సార్లు నాయకులకు ఇదే సూచన చేశారు.కానీ, అందరూ వింటున్నారు.. పెడ చెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. వెబ్ సైట్‌లో ఫొటోలు, ఆధారాలను కూడా పొందు పరిచే కాలమ్‌ను ఏర్పాటు చేస్తారు. అంటే.. ఎమ్మెల్యేలు ఎక్కడా తప్పు చేయకుండా వారు ఖచ్చితంగా ప్రజలను కలుసుకుని తీరాల్సిన పరిస్థితిని కల్పించనున్నారు. ప్రజల వద్దకు వెళ్లకుండా.. ఇంటి నుంచే కాలం గడిపే వారికి.. ఇది శరాఘాతం కానుంది.
అంతే కాదు.. మొక్కుబడిగా కూడా దీనిని చేపట్టేందుకు అవకాశం లేదు. మొత్తంగా చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగానే ఎమ్మె ల్యేలను ముందుకు నడిపించేందుకు, ప్రజల మధ్యకు వెళ్లేందుకు కీలక వ్యూహ రచన చేశారు. మరి ఎంత మంది ఎమ్మెల్యేలు ఈ రేసులో సక్సెస్ అవుతారన్నది చూడాలి. అయితే.. కొందరు ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్నారు. గుడివాడ, బాపట్ల, పరుచూరు, శ్రీకాకుళం, విజయవాడ తూర్పు, గుంటూరు వెస్టు వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువగానే ఉన్నారు.