• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు బాట‌లోనే లోకేష్‌.....

బాబు బాట‌లోనే లోకేష్‌.. మ్యాట‌ర్ ఏంటంటే... !

| ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి నేతృత్వం వహిస్తున్న టిడిపిలో ఒక చర్చ ఉంది.

By - Garuda Media
Update: 2026-05-15 13:30 GMT

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి నేతృత్వం వహిస్తున్న టిడిపిలో ఒక చర్చ ఉంది. నాయకుల విషయంలో చంద్రబాబు సంతృప్తి చెందడం అనేది చాలా కష్టమైన విషయం అనే భావన నాయకులు ఆది నుంచి వినిపిస్తున్నారు. తాము ఎంత పని చేసినప్పటికీ చంద్రబాబు అంత త్వరగా సంతృప్తి చెందర‌ని, మరింత కష్టపడితే తప్ప మార్పులు వేయరని నాయకులు తరచుగా చెబుతూ ఉంటారు. గతంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అనేకమంది నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చంద్రబాబును మెప్పించడం అంత తేలిక కాదని, తాము 100% కష్టపడితే చంద్రబాబు దగ్గర 10% కూడా మార్కులు రావ‌ని చాలామంది నాయకులు చెబుతూ ఉంటారు. పార్టీ విధానాలను గమనిస్తే ఇదే విష‌యం తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తను స్వయంగా తెలుసుకోవడంతో పాటు నాయకులు చెబుతున్న విషయాలను బేరీజు వేసుకొని చంద్రబాబు పోల్చి చూసుకుంటారు. ఆ తర్వాత నాయకుల విషయంలో నిర్ణయానికి వస్తారు. ఇది నాయకులకు ఒక రకంగా ఇబ్బందికర అంశమే అయినప్పటికీ పార్టీని డెవలప్ చేసే విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పు పట్టే అవకాశం లేదు.

అయితే ఇప్పుడు పార్టీలో యువతరం వచ్చింది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. దీంతో ఈ వ్యవహారంపై నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అంటే తాము పడుతున్న కష్టానికి మంచి మార్కులు వస్తాయి అని వారు అంచనా వేస్తున్నారు. కానీ, నారా లోకేష్ వ్యవహారాన్ని గమనించినప్పటికీ నాయకుల విషయంలో ఈ తరహా పరిస్థితి ఉండడం లేదని చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగానే నారా లోకేష్ కూడా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ.

అంత తేలికగా నాయకులకు మార్కులు వేసే పరిస్థితి నారా లోకేష్ దగ్గర కూడా లేదని ఎంతో కష్టపడితే తప్ప ఆయన దగ్గర మార్పులు సంపాదించడం చాలా కష్టమని అంటున్నారు. రాయలసీమకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవ‌ల‌ నారా లోకేష్ ను కలిశారు. తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అదేవిధంగా ప్రజల సంతృప్తి అంశాలపై వారు ఒక నివేదికను అందజేశారు. కానీ ఇదే సమయంలో ఆయన వెంటనే వారిని పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉంది.. మధ్యాహ్నం భోజనం పై వస్తున్న వార్తలు మీ దృష్టికి వచ్చాయా.. వాటి విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని ప్రశ్నలు సంధించారు.

దీంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాము ఒక కోణంలో ఆలోచిస్తే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరింత లోతుగా లోకేష్ ఆలోచించడంతో వారంతా మౌనంగా ఉండిపోయారు. కష్టపడే విషయంలో అన్ని కోణాలను పరిశీలనలోకి తీసుకుంటామని, ఏ చిన్న తేడా వచ్చిన నాయకులకు మార్కులు వేసేది లేదని ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు. అంటే ఒక రకంగా చంద్రబాబు బాటలోనే నారా లోకేష్ కూడా పయనిస్తున్నారనే విషయం నాయకులకు స్పష్టమైనది. దీనిని బట్టి నాయకులు తమ పని విధానాన్ని తమ ఆలోచన విధానాన్ని ప్రజలకు చేరువ అయ్యే విధానాన్ని కూడా మరింతగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం స్పష్టం అవుతోంది.

Tags:    
  • tdp 
  • chandrababunaidu 
  • naralokesh 
  • andhrapolitics 
  • apnews 
  • politicalleadership 
  • partyworkers 
  • internalpolitics 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS