టీసీఎస్ కొత్త ఆఫీస్.. ఒక్క అద్దె విలువే రూ.2,130 కోట్లు!

ప్రాప్ స్టాక్ పత్రాల ప్రకారం చూస్తే.. ఆస్తి డెవలపర్ అయిన ల్యాబ్ జోన్ ఎలక్ట్రానిక్స్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ తో 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోవడం కోసం సంతకం చేశారు.;

Update: 2025-08-27 10:30 GMT

TCS.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బెంగళూరులో కొత్త క్యాంపస్ ని ప్రారంభించింది. బెంగళూరులో దాదాపు 360 బిజినెస్ పార్క్ టవర్స్ యాజమాన్యంతో టిసిఎస్ అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. అంతేకాదు ఈ బిజినెస్ డీల్ కోసం ఏకంగా 1.4 మిలియన్ చదరపు అడుగులలో ఉండే ఆఫీస్ ని దాదాపు 15 సంవత్సరాలకు గానూ లీజుకు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ TCS ఆఫీస్ అద్దె గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దాని అద్దె ఏకంగా రూ.2000 కోట్లకు పైగానే ఉంది. మరి టిసిఎస్ కొత్త ఆఫీస్ భవనం అద్దె ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బెంగళూరులో అతిపెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ ఒప్పందాలలో ఒకదానిపై సంతకం చేసింది. 1.4 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని 15 సంవత్సరాల గానూ ఏకంగా రూ. 2,130 కోట్ల అద్దె చెల్లించి లీజుకు తీసుకున్నట్లు ప్రాప్ స్టాక్ పత్రాలు తెలియజేస్తున్నాయి. ఈ TCS ఆఫీస్ స్థలం నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ దక్షిణ ఐటీ కారిడార్ లోని టవర్స్ 5A , 5B లలో 360 బిజినెస్ పార్క్ వద్ద విస్తరించి ఉంది. ఈ లీజు టవర్ లో 5Aలో 6.8 లక్షల చదరపు అడుగులు 5B లో 7.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. అయితే ఇక్కడ ఒక్క చదరపు అడుగుకు రూ.66.5 చొప్పున నెలకు రూ.9.31 కోట్ల అద్దెను కంపెనీ చెల్లిస్తోంది.. అంతేకాదు టిసిఎస్ 112 కోట్ల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ ని కూడా అందించిందని తెలుస్తోంది..

ప్రాప్ స్టాక్ పత్రాల ప్రకారం చూస్తే.. ఆస్తి డెవలపర్ అయిన ల్యాబ్ జోన్ ఎలక్ట్రానిక్స్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ తో 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోవడం కోసం సంతకం చేశారు. ప్రతి 3 సంవత్సరాలకు 12% అద్దె పెరుగుతుంది.. ఇక ఈ 15 సంవత్సరాల లీజు వ్యవధిలో మొత్తం అద్దె సుమారు రూ.2,130 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక ఈ TCS ఒప్పందం అనేది బెంగళూరులో రీసెంట్ గా జరిగిన అతిపెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ లావాదేవీలలో ఒకటని నిపుణులు చెబుతున్నారు.. ఈ TCS లీజు రెండు దశల్లో ప్రారంభమవుతుంది.గ్రౌండ్ ప్లేస్ 7 అంతస్తులతో కూడిన దశ ఏప్రిల్ 1 2026లో ప్రారంభం కాగా.. 8 నుండి 13 అంతస్తుల ను కవర్ చేసే దశ ఆగస్టు 1, 2026 నుండి ప్రారంభమవుతుంది..

ఈ రెండు టవర్లు కలిసి ఐటీ సేవలు దిగ్గజం కోసం

గ్రేడ్-A వర్క్ స్పేస్ 1.4 మిలియన్ చదరపు అడుగులకు పైగా జోడిస్తాయి. అలాగే 2026 ఆర్థిక సంవత్సరంలో TCS తమ కంపెనీలో పని చేసే దాదాపు 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటించడంతో భారతదేశ ఆస్తి మార్కెట్ పై దీని ప్రభావం గురించి ఎన్నో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ ఐటీ రంగ ఉద్యోగుల తొలగింపులు ఇప్పుడు అద్దెలు , మూలధన విలువలలో దిద్దుబాటు జరగవచ్చనే ఊహగాణాలకు ఆజ్యం పోస్తున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News