• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ లోకేష్ : సీఎం అయ్యే...

పవన్ లోకేష్ : సీఎం అయ్యే చాన్స్ ఎవరికెంత ?

| ఏపీలో సీఎం సీటు అయితే ఖాళీగా లేదు అన్నది తెలిసిందే. ముఖ్యమంత్రిగా నాలుగవ సారి రికార్డు సాధించి మరీ చంద్రబాబు చైర్ లో ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-31 03:53 GMT

ఏపీలో సీఎం సీటు అయితే ఖాళీగా లేదు అన్నది తెలిసిందే. ముఖ్యమంత్రిగా నాలుగవ సారి రికార్డు సాధించి మరీ చంద్రబాబు చైర్ లో ఉన్నారు. ఆయన వయసు ఏడున్నర పదులు అన్నది జస్ట్ నంబర్ గానే చూడాలి తప్ప మరేమీ కాదని అంటారు. అంతటి హెల్తీగా ఫిట్ నెస్ తో బాబు ఉంటున్నారు.

ఆయన ఈ టెర్మ్ చాలా ఈజీగా పూర్తి చేస్తారు అని అంటున్నారు. ఇక చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఎనిమిది నెలలు మాత్రమే ఉంది. చేతిలో ఇంకా నాలుగేళ్ళ నాలుగు నెలలు మిగిలి ఉంది. మరి సంఖ్యాబలం చూస్తే మొత్తం ఏపీలోని 175 మంది ఎమ్మెల్యేలలో 164 మంది కూటమికి చెందిన వారే ఉన్నారు. అత్యంత పటిష్టంగా కూటమి సర్కార్ ఉంది.

మరి ఈ సమయంలో సీఎం ఎవరు బాబు తరువాత వారసుడు ఎవరు ఈ చర్చలు ఎందుకు జరుగుతున్నాయన్నది నిజంగా ఆశ్చర్యం కలిగించే పరిణామమే. ఇది ఎలా మొదలైంది అంటే ఈ నెల 8న విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా బాబు పవన్ మోడీతో పాటు ఫ్లెక్సీల మీద లోకేష్ ఫోటోలు కనిపించినప్పటి నుంచి అని అంటున్నారు

ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి లోకేష్ అని ఒక కాంపెయిన్ టీడీపీ నుంచి కొన్ని రోజులు సాగింది. దాని మీద అధినాయకత్వం అలెర్ట్ అయి ఆదేశాలు జారీ చేసింది. అయినా సీనియర్ నేతలు దీని మీద మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతలో సినీ ప్రముఖుడు తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వర్తమాన రాజకీయాలు విశ్లేషించే తమ్మారెడ్డి భరద్వాజ అయితే తనకు ఒక కల వచ్చిందని అందులో పవన్ సీఎం లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా అయ్యారని చెబుతూ రాజకీయ సంచలనానికి తెర తీశారు. దీంతో దీని మీద అంతా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది.

అసలు అలా జరిగే వాతావరణం ఉందా అన్నది కూడా చర్చకు వస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ కూటమికి ఎమోషనల్ స్ట్రెంగ్త్ గా ఉనారు. కానీ రాజకీయాలు అధికారం అంటే నంబర్ గేం ఆ విధంగా చూస్తే ఈ రోజుకు ఈ రోజు సీఎం గా లోకేష్ ని చేసే చాన్స్ టీడీపీకి కచ్చితంగా ఉంది అని అంటున్నారు. మొత్తం అసెంబ్లీలో ఆ పార్టీ బలం 134 మంది ఎమ్మెల్యేలు అన్నది తెలిసిందే.

అయితే నంబర్ ఉంటే సరిపోతుందా అన్నది కూడా చిక్కు ప్రశ్న. పొత్తులో ఉన్న మిగిలిన పార్టీలు కూడా కలసి రావాలి. అలా చూస్తే కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తూ పెద్దన్నగా ఉన్న బీజేపీ అనుమతి కూడా కావాలని అంటున్నారు. బీజేపీ ఈ విషయంలో తొందర పడదు కాబట్టి లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి అన్నది కూడా ప్రస్తుతానికి ఆగింది అని అంటున్నారు.

ఇక పవన్ ఛాన్సెస్ విషయానికి వస్తే ఆయన సీఎం కావాలీ అంటే ఒకటి వచ్చే ఎన్నికల్లో కూటమితో పొత్తులో ఉంటూనే పెద్ద సంఖ్యలో సీట్లు కోరాలి. అవన్నీ గెలిచి కూటమిలో సంఖ్యాపరంగా బలంగా ఉంటే అపుడు సీఎం పోస్టు షేరింగ్ కోరవచ్చు అని అంటున్నారు. అంటే ఈ టెర్మ్ లో కుదరదు అనే అంటున్నారు.

అదే విధంగా నారా లోకేష్ విషయంలో చూసుకున్నా 2029 ఎన్నికల్లో పొత్తులో అన్ని పార్టీలు ఉండి ఇదే తీరున మంచి నంబర్ తో సీట్లు గెలవాలి. అందులోనూ మెజారిటీ సీట్లు టీడీపీకి ఉంటే అప్పటికి లోకేష్ కి సీఎం చాన్స్ ఉంటుందని అంటున్నారు. అంతే తప్ప ప్రస్తుతానికి అయితే చంద్రబాబే సీఎం అని ఆయన సీటు ఈ టెర్మ్ లో కదిపే సీన్ ఉండదని అంటున్నారు. కలలు ఎవరు ఎలాగైనా కనవచ్చు కానీ గ్రౌండ్ రియాలిటీ ఎపుడూ వేరేగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ లోకేష్ ఇద్దరికీ సీఎం సీటు విషయంలో ఛాన్సెస్ సమానంగానే ఉన్నాయని అంటున్నారు. మిగిలిన రాజకీయం అంతా 2029 తరువాతనే అని చెబుతున్నారు విశ్లేషకులు.

Tags:    
  • Tammareddybharadwaj 
  • Pawankalyan 
  • Janasena 
  • APdeputychiefminister 
  • Tdp 
  • Naralokesh 
  • APminister 
  • Chandrababunaidu 
  • Ndaalliance 
  • Ysrcp 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS