ఎంగేజ్ మెంట్ అయ్యిందని దగ్గరైతే.. పెళ్లికి నో అనేశాడు

ఇదిలా ఉంటే.. తమిళనాడులో మరో దారుణం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన ప్రకాశ్.. తమ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు.;

Update: 2026-02-24 09:30 GMT

మారిన కాలానికి అనుగుణంగా కొన్ని గీతల్ని దాటేస్తున్న యువతకు అంతలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. త్వరలో పెళ్లి చేసుకుంటామన్న కారణంగా పెళ్లికి ముందే సన్నిహితంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్న వారికి అనూహ్య రీతిలో షాకులు తగులుతున్నాయి. ఈ తరహా ఉదంతం తమిళనాడులో చోటు చేసుకుంది. ఒకే రోజులో ఆ రాష్ట్రంలో రెండు షాకింగ్ ఉదంతాలు చోటు చేసుకున్నాయి.

చెన్నై ట్రిప్లికేన్ లోని ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్న యువతికి.. ఆవడిలోని ఐటీ ఉద్యోగి కార్తీక్ కు గత ఏడాది అక్టోబరులో ఎంగేజ్ మెంట్ జరిగింది. మంచి ముహుర్తాలు లేని కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న రిసెప్షన్ అని.. 22న పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు. ఎటూ పెళ్లి చేసుకుంటామన్న ఉద్దేశంతో బాధితురాలు సన్నిహితంగా ఉంది. కట్ చేస్తే.. పెళ్లికి తేదీలు దగ్గరకు వచ్చిన వేళ.. ఆ యువకుడు తనకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పేయటం షాక్ కు గురి చేసింది.

తనకు బాధితురాలిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని.. మరో యువతిని తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెప్పటంతో షాక్ తిన్న యువతి.. పోలీసుల్ని ఆశ్రయించింది. ఎంగేజ్ మెంట్ అయ్యింది కదా అని తాను కార్తీక్ తో సన్నిహితంగా ఉన్నట్లుగా చెబుతూ.. తాము శారీరకంగా దగ్గరయ్యామని.. ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెబుతున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు కార్తీక్ ను అరెస్టు చేశారు. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ సోమవారం సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

ఆయన పెట్టిన పోస్టు కూడా చెన్నై ఉదంతం తరహాలోనే ఉండటం విశేషం. ఇటీవల కాలంలో పెళ్లి ఫిక్సు చేసుకొని.. ఆ తర్వాత సన్నిహితంగా ఉండటం.. పెళ్లికి దగ్గరయ్యే సమయానికి పెళ్లికి నో చెప్పటం.. పెళ్లి చేసుకోవాలంటే అదనపు డబ్బులు కావాలని చెప్పటం.. సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని చూపించి బ్లాక్ మొయిల్ చేయటం.. లాంటి ఉదంతాలు ఎక్కువ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. ఎంగేజ్ మెంట్ అయ్యింది.. ఎటూ పెళ్లి చేసుకుంటున్నామన్న నమ్మకంతో శారీరకంగా దగ్గర కావటం జరుగుతోందన్నారు. ఇలాంటి తప్పులు చేయొద్దన్న సూచన చేశారు. కొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతున్న వేళ.. పెళ్లి వరకు వెయిట్ చేయటం మంచిదని సూచించటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తమిళనాడులో మరో దారుణం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన ప్రకాశ్.. తమ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ ఉపాధి కోసం తమిళనాడుకు వచ్చారు. ప్రకాశ్ ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంటే.. ఆ యువతి తిరుప్పూర్ జిల్లాలో ఒక బనియన్ కంపెనీలో పని చేసతోంది. కొన్ని రోజులుగా సదరు యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా గుర్తించిన ప్రకాశ్.. ఆ యువతిని నిలదీశాడు. దీంతో.. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో ప్రియురాలికి నచ్చజెప్పి ఊరికి వెళదామని తిరుప్పూర్ రైల్వే స్టేషన్ కు రమ్మన్నాడు. అతడి మాటల్ని నమ్మిన యువతి..కొత్త ప్రియుడ్ని తీసుకొని ప్రకాశ్ కు పరిచయం చేసింది. తాను కొత్త యువకుడితోనే ఉంటానని.. తామిద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రకాశ్.. తన వద్ద ఉన్న బ్లేడ్ తో ఆ యువతి గొంతు కోసి పారిపోయాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని అరెస్టు చేశారు.

Tags:    

Similar News