సీఎం ఎవరు స్వామీ .విజయ్ వర్సెస్ పళని స్వామి !
ఇక తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 అన్నది కీలకంగా మారింది.;
తమిళనాడు రాజకీయం చూస్తే దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా బిగ్ ట్విస్టులతో సాగుతోంది. మే 4న ఫలితాలు వచ్చాయి. ఆనాటి నుంచి కుర్చీలాట మొదలైంది. అతి పెద్ద పార్టీగా 108 సీట్లతో ఉన్న విజయ్ టీవీకే పార్టీకి అధికారం అందినట్లే అందుతోంది, అందని పండు అవుతోంది. ఒక విధంగా ఇళయ దళపతి గా ఉన్న విజయ్ తాను నటించిన 70కి పైగా సినిమాల్లో చూడని యాంటీ క్లైమాక్స్ లను ఎన్నో రాజకీయ తెర మీద చూస్తున్నారు అని అంటున్నారు. మే 4న ఉదయం ట్రెండ్స్ అన్నీ టీవీకేకి అనుకూలంగా రావడంతో ఇంకేముంది సీఎం అయిపోయారు అని అంతా అనుకున్నారు. కానీ అసలైన కథ అక్కడ నుంచే మొదలైంది. విజయ్ కి రాజకీయ కష్టాలు ఏంటో ప్రతీ రోజూ వెంటాడి మరీ తెలియచేస్తున్నాయి.
మెజారిటీ మార్క్ :
ఇక తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 అన్నది కీలకంగా మారింది. చూడడానికి అయిదారు సీట్లే అని అంటున్నా ఆ నంబర్ కి చేరుకోవడానికి విజయ్ నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మొదట కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ అయిదుగురు ఎమ్మెల్యేలు విజయ్ వైపు వచ్చారు. దాంతో నంబర్ కాస్తా 112 కి చేరింది. ఇక వామపక్షాలు నుంచి మరో నలుగురు కలిశారు, దాంతో 116 అయింది, వీసీకే అన్న పార్టీ మొదట మద్దతు అని చెప్పినా లేఖ ఇవ్వలేదు, దాంతో ఆ రెండు ఎమ్మెల్య్హే సీట్లు కొరతావచ్చాయి. అలాగే మరో పార్టీ ఐయూఎంఎల్ అన్న పార్టీ కూడా టీవీకేకు మద్దతు లేదు అంది. దాంతో 120 మంది దాకా గవర్నర్ రాజేంద్రని కలసినపుడు విజయ్ చెప్పిన నంబర్ 116 వద్ద ఆగిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం మే 9న విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందా అన్నది బిగ్ సస్పెన్స్ గా కొనసాగుతోంది.
రంగంలోకి పళని స్వామి :
ఇంకేముంది మ్యాజిక్ ఫిగర్ దక్కేసింది విజయ్ శనివారం సీఎం గా ప్రమాణం అనుకునేంతలో రాత్రికి రాత్రి పరిణామాలు మారిపోతున్నాయి. తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏఏంఎం కే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, అన్నా డీఎంకే నాయకుడు మాజీ సీఎం పళనిస్వామికి తన మద్దతును ప్రకటించారు. ఈ మేరకు ఆయన నేరుగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌కు లేఖ కూడా రాశారు. తన మద్దతు పళనిస్వామికే అంటూ ఆయన గవర్నర్ కి విన్నవించారు. దినకరన్ పార్టీ ఒక సీటు గెలుచుకుంది. మన్నార్‌గుడి నియోజకవర్గం నుండి ఎస్. కామరాజ్ ఆ పార్టీ తరఫున విజయం సాధించారు. ఇక గవర్నర్‌కు దినకరన్ రాసిన లేఖలో ఆయన పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ కూడా అన్నా డీఎంకే కి తన మద్దతు అని స్పష్టం చేశారు.
కొత్త సర్కార్ కోసం :
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పళనిస్వామిని ఆహ్వానించాలని గవర్నర్ కి దినకరన్ కోరడం విశేషం. టీవీకేకు తమ పార్టీ మద్దతు అని వస్తున్న వార్తలలో నిజం లేదని కూడా దినకరన్ పేర్కొనడం విశేషం. తమ పార్టీ ఎన్ డీయేలో ఉందని ఆయన చెప్పారు. తమ పార్టీ టీవీకేకి మద్దతు అంటూ వచ్చిన సమాచారం కానె ఇచ్చిన లేఖ కానీ ఫేక్ అని ఆయన చెప్పారు. గవర్నర్ కి కలసినపుడు దీని మీద కూడా విచారణ జరిపించాలని కోరినట్లుగా చెప్పారు. మొత్తం మీద చూస్తూంటే దినకరన్ రంగ ప్రవేశం చేయడంతో పాటు పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రి అనడం డీఎంకే అధినేత స్టాలిన్ తో వీసీకే పార్టీ నేతలు భేటీ కావడం ఇంకో వైపు టీవీకేకు ఐయూఎంఎల్ మద్దతు విత్ డ్రా చేసుకుంటామని చెప్పడంతో మ్యాజిక్ మార్క్ కి విజయ్ పార్టీ దూరంగానే ఉంటోంది. ఇక పళనిస్వామి అలాగే స్టాలిన్ వంటి దిగ్గజాల తెర వెనక వ్యూహాలు విజయ్ ని చిత్తు చేస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఎవరు తమిళనాట కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో ఏమి జరుగుతుందో.