అఫ్గాన్ రాజ్యంలో పురుషులకు హెయిర్ స్టైల్ కోడ్
ఇంతకాలం పరిమితులతో తమ దేశంలో మహిళలకు చుక్కలు చూపిస్తున్న అఫ్గాన్ పాలకులు ఇప్పుడు పురుషులను ఆ జాబితాలోకి తీసుకొచ్చేశారు.;
ఇంతకాలం పరిమితులతో తమ దేశంలో మహిళలకు చుక్కలు చూపిస్తున్న అఫ్గాన్ పాలకులు ఇప్పుడు పురుషులను ఆ జాబితాలోకి తీసుకొచ్చేశారు. తాలిబన్ల ఏలుబడిలో ఉన్న ఆ దేశంలో ఇటీవల కాలంలో పెట్టిన నిబంధనల కారణంగా పురుషులకూ చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా ఐక్యరాజ్యసమితి రిపోర్టు వెల్లడించింది. తాలిబన్ పాలకుల పైత్యం కారణంగా మగాళ్లు ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలన్న విషయమే కాదు.. చివరకు వారి గడ్డం సైతం వారు చెప్పినట్లుగా ఉండాలన్న నిబంధనను తీసుకొచ్చేసింది.
దీంతో హెయిర్ కటింగ్ షాపు యజమానులకు కొత్త కష్టం వచ్చి పడినట్లుగా రిపోర్టు పేర్కొంది. కాస్తంత స్టైలిష్ గా హెయిర్ కట్ చేయించుకున్న పురుషులను మాత్రమే కాదు.. వారికి ఆ తీరులో హెయిర్ కట్ చేసిన షాపుల వారిని సైతం పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అంతేకాదు.. బస్సులు.. రైళ్లలో ఎలా వ్యవహరించాలని అన్న దాని మీదా నిబంధనలు తీసుకొచ్చేశారు. పండుగల వేళలో ఎలా వ్యవహరించాలన్న దానికి రూల్స్ తెచ్చేశారు.
ఇప్పటికే అఫ్గానిస్థాన్ లోని మహిళలు బయటకు వచ్చినప్పుడు ముఖం కనిపించేలా ఉండకూడదు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో పెద్దగా మాట్లాడకూడదన్న రూల్ ఇప్పటికే ఉంది. ఈ రూల్స్ ను సరిగా పాటిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేసేందుకు 3300 మంది ఇన్ స్పెక్టర్లను నియమించారని రిపోర్టు వెల్లడించింది. అంతేకాదు.. అఫ్గాన్ లో చదువుకునే విషయంలో.. ఉద్యోగం చేయటంలో మహిళలకు పరిమితులు విధించటం.. వారిని అందులోకి అనుమతించకపోవటం తెలిసిందే.
అంతేకాదు.. గడిచిన ఆర్నెల్లో అరెస్టు అయిన పురుషులు చేసిన తప్పులేమిటో తెలుసా? తాము నిర్దేశించిన రీతిలో గడ్డం లేకపోవటం.. జుట్టు కత్తించుకోకపోవటమేనని వెల్లడించింది. అంతేకాదు అరెస్టు అయిన వారిలో వీరికి హెయిర్ కట్ చేసిన వారు కూడా ఉన్నారు. అంతేకాదు.. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా నమాజ్ చేయని పురుషులను తాలిబన్లు అరెస్టు చేశారు. ఇదంతా చదివిన తర్వాత అఫ్గాన్ మగాళ్ల పరిస్థితిని తలుచుకుంటేనే భయం వేయట్లేదు?