5 సెకన్లలో 4 బుల్లెట్లు.. సిడ్నీ నుంచి షాకింగ్ వీడియో!

అవును... ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.;

Update: 2025-12-15 11:14 GMT

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై ఉగ్ర రక్కసి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అత్యంత భయానకమైన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు. మరోవైపు భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించగా.. గాయపడిన మరో ఉగ్రవాదికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట షాకింగ్ గా మారింది.

అవును... ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిని ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటించింది. ఈ ఘటనలో పాలొన్న వారిలో సాజిద్ అక్రం (50) మృతి చెందగా.. అతని కుమారుడు నవీద్ అక్రం (24) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమయంలో అతడి తుపాకీ కాల్పుల వీడియో వెన్నులో వణుకు పుట్టిస్తోందని అంటున్నారు.

తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తోన్న వీడియోలో ఉగ్రవాది కేవలం 5 సెకన్ల వ్యవధిలో 4 బుల్లెట్లు కాల్చాడు. ఈ సందర్భంగా ఈ వీడియో చూసినవారు.. ఈ ఉగ్రవాది స్నిపర్ శిక్షణ పొందినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. అతడి ఫైరింగ్ నైపుణ్యం చూస్తుంటే.. అతడు షూటింగ్ అకాడమీలో శిక్షణ పొంది ఉండవచ్చని సూచిస్తున్నాయని అంటున్నారు. ఇతడికి తుపాకీ హార్డ్ వేర్ గురించి పూర్తి అవగాహన ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు.

ఈ వీడియోలో.. ఈ క్రూరమైన ఉగ్రవాది, ఎత్తైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ సమయంలో అతడి రైఫిల్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని పని మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అతడు ఐదు సెకన్ల వ్యవధిలో నాలుగు బుల్లెట్లు పేల్చాడు. ఈ వీడియోలో కనిపిస్తున్న తుపాకీ.. బ్లేజర్ లేదా బెరెట్టా మోడళ్ల మాదిరిగా స్ట్రెయిట్ ఫుల్ బోల్ట్ యాక్షన్ వర్గానికి చెందినదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియన్ వేటగాళ్ల వద్ద ఉంటాయని అంటున్నారు.

ఆసిస్ ప్రధానిపై నెతన్యాహు నిప్పులు!:

తాజాగా సిడ్నీలో జరిగిన కాల్పుల ఘటనను.. యూదులపై జరిగిన ఉగ్రదాడిపై ఆస్ట్రేలియా పోలీసులు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇలా యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని రక్షించడంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ విఫలమయ్యారని ఆరోపించారు. ఇదే సమయంలో.. ఆల్బనీస్ విధానాలు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని దాడులకు దారితీయవచ్చని తెలిపారు.



Tags:    

Similar News