• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జీవితాంతం ఆకాశంలోనే...

జీవితాంతం ఆకాశంలోనే ఎగురుతూ గడిపేసే డెవిల్ పక్షి గురించి మీకు తెలుసా?

| దెయ్యం పక్షి అని పిలవబడే ఈ పక్షి సుమారు సంవత్సరం పాటు నేల మీదకు దిగకుండా ఆకాశంలోని తిరుగుతుంది.

By - Tupaki Desk
Update: 2024-09-26 04:58 GMT

మనలో చాలామందికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అలా హాయిగా కాసేపు సాయంకాలం బయట గడిపేటప్పుడు మనకు ఎన్నో రకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎన్నో జాతుల పక్షులు ఉన్నప్పటికీ వాటిలో మనకు కొన్నిటి గురించి మాత్రమే తెలుసు. అయితే ఒక పక్షి సుమారు సంవత్సరం పాటు ఆగకుండా ఎగురుతుంది అన్న విషయం మీకు తెలుసా. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.. ఆ పక్షి అలా నెలలు తరబడి భూమిపైన దిగకుండా గాల్లోనే చెక్కర్లు కొడుతూ ఉంటుంది. మరి ఆ పక్షి ఏమిటో? అది ఎందుకు ఆకాశం నుంచి కిందకు దిగదో తెలుసుకుందాం పదండి..

దెయ్యం పక్షి అని పిలవబడే ఈ పక్షి సుమారు సంవత్సరం పాటు నేల మీదకు దిగకుండా ఆకాశంలోని తిరుగుతుంది. ఆ సమయంలో యూరప్ నుంచి ఆఫ్రికా కి వెళ్లి మళ్లీ ఆఫ్రికా నుంచి యూరప్ కి చేరుకుంటుంది. దీనితోపాటు ఆ పక్షి లో ఎన్నో అద్భుతమైన లక్షణాలు కూడా ఉన్నాయట. అత్యంత వేగంగా ఎగరడంతో పాటు గాల్లోనే తనకు అవసరమైన ఆహారాన్ని వేటాడి తినే లక్షణం కూడా ఈ పక్షి జాతికి ఉంది. అవి కేవలం పిల్లలను కనడానికి మాత్రమే నేల మీదకు దిగి వస్తాయి. ఈ పక్షి అసలు పేరు స్విఫ్ట్.

స్విఫ్ట్ జాతికి చెందిన ఈ పక్షులకు పొడవాటి రెక్కలతో పాటు చిన్న కాళ్ళు ఉంటాయి. ఇవి తరచుగా గుంపులుగా విహరిస్తూ ఉంటాయి. తన జీవితకాలంలో అది 99% కంటే ఎక్కువ గాలిలోనే గడుపుతుంది. ఎదిగే దశలో స్విఫ్ట్ లు ఎక్కువగా కీటకాలను తినడానికి ఇష్టపడతాయి. వలస పక్షి అయిన కామన్ స్విఫ్ట్ శీతాకాలం ఎక్కువగా వెచ్చని ప్రాంతాల వైపు పయనిస్తుంది. అలా వలస సమయంలో ఆల్పైన్ జాతికితే చెందిన స్విఫ్ట్ పక్షులు సుమారు 200 రోజులపాటు ఆగకుండా గాలిలో ఎగురుతాయి. ఈ సమయంలో గాలిలో ఎగిరే కీటకాలను తిని అవి తమ ఆకలి తీర్చుకుంటాయి. ఇవి గంటకు 112 కిలోమీటర్ల వేగంతో ఎగర గలవు. వాతావరణం అనుకూలించని సమయాలు, సంతాన ఉత్పత్తి కాలంలో మాత్రమే ఇవి భూమిపైన ల్యాండ్ అవుతాయి.

Tags:    
  • Swiftbirds 
  • Flying 
  • Air 
  • Europe 
  • Africa 
  • Countrys 
  • Swift 
  • Devillbirds 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS