పిఠాపురంపై వర్మ హాట్ కామెంట్స్!
పిఠాపురం వరంగా ప్రాముఖ్యత తెచ్చుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.;
పిఠాపురం వరంగా ప్రాముఖ్యత తెచ్చుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పిఠాపురం గురించి ఆయన మాట్లాడుతూ తాను అక్కడే పుట్టాను అన్నారు. తనకు జన్మనిచ్చిన ప్రాంతమని తన జీవితం అని చెప్పారు. తాను పిఠాపురం వదిలి ఎక్కడికి పోతాను అని మీడియా ముఖ్యంగా ఆయన ప్రశ్నించారు. ఎవరైనా ఎప్పుడన్నా ఎక్కడైనా తన సొంత ఊరు విడిచి వెళ్ళిపోతారా అని ఆయన ప్రశ్నించారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే రాజకీయంగా సంచలనంగా మారాయి.
ఎందుకు ఈ విధంగా :
నిజానికి పిఠాపురం వర్మ బలమైన నాయకుడిగా అక్కడ ఉన్నారు. ఆయన 2009, 2014, 2019 లలో మూడు సార్లు పోటీ చేశారు. 2014లో భారీ మెజారిటీతో నెగ్గారు. పాతికేళ్ళుగా టీడీపీలో కొనసాగుతున్నారు. 2024 లో కచ్చితంగా గెలుస్తాను అని అనుకున్నారు. అందుకే గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో అనూహ్యంగా టికెట్ కి ఎసరు వచ్చింది. జనసేనతో పొత్తుతో ఆ సీటు ఏకంగా అధినేత పవన్ కళ్యాణ్ కి వెళ్ళింది. ఈ పరిణామాలతో వర్మ కంటే ఆయన అనుచరులే ఎక్కువగా ఆందోళన చెందారు, అయితే చంద్రబాబు సర్దిచెప్పడంతో ఆయన ఆగారు, అయితే వర్మకు తగిన నామినేటెడ్ పదవి అయితే ఇప్పటిదాకా రాలేదు, ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. ఆ నిర్వేదం ఒక వైపు ఉంటే మరో వైపు ఆయన రాజకీయ జీవితం గురించి తాజాగా జరుగుతున్న మరో ప్రచారం ఆయన వర్గీయులలో కలవరం రేపుతోంది.
వేరే చోట నుంచి పోటీ :
వర్మ వచ్చే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం అయితే పిఠాపురంలో సాగుతోంది. దాంతో ఆయన వర్గం ఆందోళనను గమనించిన వర్మ ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ అయితే హాట్ గానే సాగాయి. తాను రాజకీయం కోసమే కాదు తన జీవితం అంతా పిఠాపురంతోనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు. తాను వేరే చోటకు ఎందుకు వెళ్తాను అని ప్రశ్నించారు. తన ఎదుగుదల అంతా పిఠాపురంతో ముడిపడి ఉందని చెబుతూ వేరే నియోజకవర్గంలో పోటీకి చాన్సే లేదని కొట్టిపారేశారు.
పిఠాపురంతోనే :
దీంతో వర్మ వచ్చే ఎన్నికల్లో అయినా పిఠాపురం నుంచే పోటీకి రెడీ అవుతున్నారన్న సంకేతాలు అయితే బలంగా పంపించారు అని అంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం తన సొంత సీటుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన పిఠాపురంలో తన సొంత నివాసం కూడా నిర్మించుకుంటున్నారు. ఇక రాజకీయాల్లో ఉన్నంతకాలం పిఠాపురం వీడేది లేదన్న సంకేతాన్ని పవన్ వైపు నుంచి పంపిస్తున్నారు. దాంతో వర్మ కూడా పిఠాపురం తన జన్మ స్థానం అని ఎమోషనల్ టచ్ తో కూడిన కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురం మరో సారి హాట్ టాపిక్ గా మారింది. మరి వర్మ పోటీ చేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. వచ్చే ఎన్నికలు ఇంకా మూడేళ్ళ పై దాటి ఉన్నాయి. కాబట్టి అప్పటిదాకా ఈ రకమైన రాజకీయ చర్చ రచ్చ అలా కొనసాగుతూనే ఉంటాయని అంటున్నారు.