రాజ్య‌స‌భ‌లో ర‌గ‌డ‌: 'తూ.. లుంగీవాలా.. స‌మ‌జ్‌న‌యాహే క్యా'!

అయోధ్య రామ‌య్య‌కు భ‌క్తులు ఎంతో ఘ‌నంగా స‌మ‌ర్పించిన విరాళాల‌ను.. ఫ్యాంటు జేబుల్లో కుక్కుకుని అప‌హ‌రిం చార‌ని సీసీ టీవీకెమెరాల‌కు కూడా చిక్క‌కుండా దోచుకున్నార‌ని.. బిట్రాస్ వ్యాఖ్యానించారు.

Update: 2026-08-12 11:38 GMT

వ్య‌క్తిగ‌త విష‌యాలు సైతం పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో రచ్చ‌కు దారి తీస్తున్నాయి. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీని చాయ్ వాలా అంటూ.. కాంగ్రెస్ ఎంపీ ఒక‌రు విమ‌ర్శించ‌డం దుమారం రేపింది. తాజాగా రాజ్య‌స‌భ‌లో ఏకంగా పురుషులు క‌ట్టుకునే వ‌స్త్రాల‌ను ఎద్దేవా చేస్తూ.. బీజేపీ మ‌హిళా ఎంపీ.. సుస్మితా దేవ్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ర‌చ్చ‌కు దారి తీశాయి. అయోధ్య విరాళాల చోరీ అంశంపై కేర‌ళ‌కు చెందిన‌ సీపీఎం స‌భ్యుడు సీనియ‌ర్ పాత్రికేయుడు కూడా అయిన‌.. జాన్ బిట్రాస్ మాట్లాడుతున్న స‌మ‌యంలో సుస్మితా దేవ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

``ఓ లుంగీ క‌ట్టుకున్న పెద్దాయ‌నా..`` అంటూ.. ఆమె బిట్రాస్‌ను సంబోధించారు. దీంతో స‌భ్యులు పార్టీల‌కు అతీతంగా ఆమె వైఖ‌రిని దుయ్య‌బ‌ట్టారు. ఇదేస‌మ‌యంలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ స‌భ్యులు త‌మ త‌మ స్థానాల్లో లేచి నిల‌బ‌డి.. దేవ్‌ను స‌స్పెండ్ చేయాల‌ని.. ఆమె భార‌తీయ సంస్కృతిని, ముఖ్యంగా ద‌క్షిణాది సంస్కృతిని తీవ్రంగా అవ‌మానించార‌ని మండిప‌డ్డారు. ద‌క్షిణాది సంస్కృతిలో పంచె, లుంగీల‌కు ఎంతో ప్రాధాన్యం ఉంద‌ని, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కూడా స‌భ‌కు లుంగీక‌ట్టుకునే వ‌చ్చేవార‌ని గుర్తు చేశారు.

దీంతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో చైర్మ‌న్ సీపీ రాధాకృష్ణ‌న్ కూడా సుస్మితాదేవ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌ట్టుబొట్టుల గురించి.. సంస్కృతి గురించిఎద్దేవా చేయ‌డానికి వీల్లేద‌ని.. మీ మాట‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని సీపీఎం స‌భ్యులు డిమాండ్ చేయ‌డంతో స‌భ‌లో నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ఈ స‌మ‌యంలో స‌భ‌ను వాయిదా వేశారు.

ఏం జ‌రిగింది?

అయోధ్య రామ‌య్య‌కు భ‌క్తులు ఎంతో ఘ‌నంగా స‌మ‌ర్పించిన విరాళాల‌ను.. ఫ్యాంటు జేబుల్లో కుక్కుకుని అప‌హ‌రిం చార‌ని సీసీ టీవీకెమెరాల‌కు కూడా చిక్క‌కుండా దోచుకున్నార‌ని.. బిట్రాస్ వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలో స్పందించిన‌.. బీజేపీ ఎంపీ సుస్మితాదేవ్‌.. ``ఓ లుంగీ క‌ట్టుకున్న పెద్దాయ‌నా.. నీకు అర్థ‌మ‌వుతోందా? అక్క‌డ అలా జ‌ర‌గ‌లేదు. నువ్వు పెద్దది చేసి చూపిస్తున్నావ్‌. నీలాగా లుంగీలు క‌ట్టుకుంటారా అంద‌రూ.. `` అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్య‌వ‌హారం వివాదానికి దారి తీయ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రీ సుస్మిత‌..

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన యువ ఎంపీ సుస్మితా దేవ్‌. తృణ‌మూల్ కాంగ్రెస్‌తో రాజ‌కీయాలు ప్రారంభించిన ఆమె.. 2021లోనే ఆ పార్టీతో విభేదించి.. బీజేపీ పంచ‌న చేరారు. ఇటీవ‌ల .. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు బీజేపీకి అనుకూలంగా మార‌డం, వారికి స‌భ‌లో ప్ర‌త్యేక సీట్లు వేయ‌డం వ‌రకు తెర‌వెనుక ఆమె చ‌క్క‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆమె.. గ‌తంలో పోలీసుల‌పై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేసి మీడియాలో నిలిచారు.

Tags:    

Similar News