లవ్ మ్యారేజ్... రోబోతో పెళ్లికి సిద్ధమైన భారత ఇంజనీర్!

అవును... రోబో సినిమాలో చిట్టీ.. ఐశ్వర్యరాయ్ ప్రేమించినట్లుగానే... రాజస్థాన్ కు చెందిన ఒక ఇంజినీర్ రోబోతో ప్రేమలో పడ్డాడు.

Update: 2024-04-28 12:44 GMT

"రోబో" సినిమాలో రోబో రజనీకాంత్, మనిషి అయిన ఐశ్వర్యరాయ్ ని ప్రేమిస్తాడు. ఇదే క్రమంలో బాలీవుడ్ లో వచ్చిన "తేరి బాతో మే ఐసా ఉల్ఝా జియా" అనే సినిమాలో హీరో షాహిద్ కపూర్.. రోబో అయిన కృతి సనన్‌ తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో తాజాగా అలాంటి పరిణామమే రియల్ లైఫ్‌ లో జరిగింది. భారత్‌ కు చెందిన ఓ ఇంజినీర్ ఒక రోబోతో ప్రేమలో పడ్డాడు.. పెళ్లికి రెడీ అయ్యాడు!

అవును... రోబో సినిమాలో చిట్టీ.. ఐశ్వర్యరాయ్ ప్రేమించినట్లుగానే... రాజస్థాన్ కు చెందిన ఒక ఇంజినీర్ రోబోతో ప్రేమలో పడ్డాడు. ఆ రోబో కోసం పరితపించిపోతున్నాడంట. అలా అని అది ప్రొఫెషనల్ లవ్ అనుకుంటే పొరపాటే సుమా! త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.

వివరాళ్లోకి వెళ్తే... సూర్యప్రకాశ్ ఒక రోబోటిక్స్ నిపుణుడు. ఆయన.. అజ్మీర్‌ లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పట్టా పొంది.. 2016లో ఇండియన్ నేవీలో సెలక్ట్ అయ్యాడు. అయితే... టెక్నికల్ రంగంలో రీసెర్చ్ చేయడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌ గా పని చేస్తున్న సూర్య.. త్వరలోనే "గిగా" అనే రోబోని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ క్రమంలో... ఈ రోబో సుమారు రూ.19 లక్షల ఖర్చుతో తయారవుతోందని.. త్వరలోనే సంప్రదాయ పద్ధతిలో ఆ రోబోని పెళ్లి చేసుకోబోతున్నట్లు సూర్యప్రకాశ్ తెలిపాడు. అయితే... మొదట్లో ఈ విషయం తెలిసిన తన కుటుంబసభ్యులు షాక్‌ కు గురయ్యారని చెబుతున్న ఆయన... ఆ తర్వాత వారు ఒప్పుకున్నారని చెబుతుండటం గమనార్హం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మార్చి 22వ తేదీన గిగాతో ఇప్పటికే అతనికి నిశ్చితార్థం జరిగిందట.

Tags:    

Similar News