దేశ‌వ్యాప్త స‌ర్వే: సంపాద‌న స‌రే.. సెక్స్ మాటేంటి?

కుటుంబాలను నిలబెట్టే కీలకమైన అంశం శృంగారం. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా కుటుంబాలు రోడ్డున పడగాయి.;

Update: 2025-09-06 14:30 GMT

కుటుంబాలను నిలబెట్టే కీలకమైన అంశం శృంగారం. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా కుటుంబాలు రోడ్డున పడగాయి. విడాకుల దిశగా అడుగులు వేస్తాయి. అయితే, ఒకప్పుడు విడాకులు తీసుకున్న కేసులు ఎక్కువగా ఉంటే.. రాను రాను ఈ పరిస్థితి మారిపోయి.. వివాహేతర సంబంధాలకు దారితీస్తోందన్నది తాజాగా ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. ఢిల్లీ యూనివర్సిటీ, మద్రాస్ ఐఐటి సంస్థలు నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో సంచలన విషయం వెలుగు చూసింది.

కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవడం కన్నా వివాహేతర సంబంధాలతో సంతృప్తి పడాలనే పరిస్థితి సమాజంలో పెరుగుతోంది అన్నది ఈ సర్వేల ప్రధాన సారాంశం. ఇది భవిష్యత్తు భారతదేశానికి మంచిది కాదన్నది, సమాజ స్థితికి మంచిది కాదన్నది సర్వే స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం పురుషుల్లో కోల్పోతున్న శృంగార ఆసక్తి అని సర్వే తెలిపింది. ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, విశాఖపట్నం, బెంగళూరు, తిరువ‌నంత‌పురం సహా మొత్తం 18 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 2 లక్ష‌ల మంది త‌మ అభిప్రాయం వెల్ల‌డించారు.

ఈ సర్వేలో పురుషుల కంటే కూడా స్త్రీలలో శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతోందని తేలింది. ఒకప్పుడు పురుషుల్లో ఆసక్తి ఎక్కువగా ఉండగా.. గత దశాబ్ద కాలంగా సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు.. వృత్తి రీత్యా వచ్చిన మార్పుల కారణంగా పురుషుల్లో శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతోంద‌ని, శృంగారం అంటే కేవ‌లం `ఒక పని` అనుకునే దిశగా వారు ఆలోచన చేస్తున్నారని తేలింది. దీంతో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి అన్నది సర్వేలో ప్రధానంగా గుర్తించిన విషయం.

ముఖ్యంగా.. బీహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయని సర్వే స్పష్టం చేసింది. ఇక, హైదరాబాద్, విశాఖపట్నం వంటి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్క‌డ‌ కూడా వివాహేతర సంబంధాలకు ఈ నగరాలు కేంద్రాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి ప్రధాన కారణం పురుషులు శృంగారం పట్ల పెద్దగా ఆసక్తి చూపించకపోవడమేన‌ని తెలిపింది. మద్యానికి అదేవిధంగా సిగరెట్లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారన్నది సర్వే స్పష్టం చేసింది.

ఈ కారణంతో శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడంతో పాటు లైఫ్ పార్టనర్ విషయంలో అనాశక్తి పెరుగుతోంద‌ని, కేవలం డబ్బు సంపాదన తోనే `జీవితం` అనుకుంటున్న పరిస్థితి ఉందని సర్వే స్పష్టం చేసింది. దాదాపుగా 2 లక్షల మందిని ఈ సర్వే పలకరించగా వీరిలో మెజారిటీ పురుషులు డబ్బు ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా గడిచిపోతుందని సమాధానం చెప్పినట్టు తెలిపింది. అయితే మెజారిటీ మహిళలు మాత్రం డబ్బుతోనే కాదు శృంగారం పట్ల కూడా ఆసక్తి ఉంటేనే కుటుంబాలు నిలబడతాయని చెప్పారు.

ఐఐటి మద్రాసు కు చెందిన మహిళ ప్రొఫెసర్ మాట్లాడుతూ పురుషుల్లో తగ్గిపోతున్న శృంగార వాంఛలు కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. దీనికి ఆహారపు అలవాట్లు మద్యం, సిగరెట్ వంటివే కాకుండా.. ప‌ని వేళ‌లు, ఆఫీసులోనే ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాల్సి రావ‌డం వంటివి కారణాలుగా పేర్కొన్నారు. దీని నుంచి పురుషులు బ‌య‌ట ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె స‌ల‌హా ఇచ్చారు. మొత్తంగా.. సంపాద‌న‌పై దృష్టి మంచిదే అయినా.. కీల‌క‌మైన సెక్స్ విష‌యాన్ని పురుషులు నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

Tags:    

Similar News