వీధి కుక్కలు కరిస్తే రాష్ట్రాలకే భారీ జరీమానా

ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ లో వీధి కుక్కల విషయంలో తీర్పు చెప్పింది. వీధి కుక్కలను అందరూ తిరిగే బహిరంగ ప్రదేశాలలో ఉంచకూడదని స్పష్టంగా చెప్పింది.;

Update: 2026-01-14 00:30 GMT

వీధి కుక్కలు ఇపుడు అధికం అయిపోయాయి. అవి గ్రామ సింహాల మాదిరిగా వీధుల్లో తిరుగుతున్నాయి. వారినీ వీరినీ చూడకుండా కాటేసి పారేస్తున్నాయి. వారం క్రితమే వీధి కుక్కక ఇష్యూ మీద విచారించిన సుప్రీంకోర్టు కుక్కల మూడ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అని వ్యాఖ్యానించింది. తాజాగా మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల విషయంలో సరైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకపోతే ఇక మీదట కుక్క కరచి ఎవరైనా మరణిస్తే భారీ జరీమానాలు రాష్ట్ర ప్రభుత్వాలకే వేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

మనుషుల మీద కరుణ లేదా :

అంతే కాదు సుప్రీంకోర్టు ఇంకా కీలక వ్యాఖ్యలే చేసింది. జంతువుల మీద ప్రేమ ఉండడం కాదు మనుషుల మీద కూడా కరుణ ఉండాలి కదా అని ప్రశ్నించింది. బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వ్యక్తులు సంస్థల తీరుని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కుక్క ఒక్కసారి కరిచినా దాని ప్రకారం ఆ కాటు వల్ల వచ్చే ఇబ్బందులు జీవిత కాలం అంతా ఉంటాయని పేర్కొంది. కుక్కల దాడులలో ఎవరైనా చిన్న పిల్లలు మరణిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

షెల్టర్లకు తరలించాలి :

ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ లో వీధి కుక్కల విషయంలో తీర్పు చెప్పింది. వీధి కుక్కలను అందరూ తిరిగే బహిరంగ ప్రదేశాలలో ఉంచకూడదని స్పష్టంగా చెప్పింది. స్కూళ్ళు, క్రీడా ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలో వీధి కుక్కలు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ఆ దిశగా ఎలాంటి మార్పు కనబడకపోవడంతో దేశ అత్యున్నత న్యాయ స్థానం ఈసారి ఘాటు వ్యాఖ్యలే చేసింది.

జవాబు దారిగా ఉండాలి :

కుక్క కాటు సంఘటనలకు బాధ్యులు ఉండాలని జవాబుదారీగా ఎవరినైనా ఉంచాలని రాష్ట్రాలను కోరుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. గత ఐదు సంవత్సరాలుగా వీధి జంతువులపై నిబంధనలను అమలు చేయకపోవడం పై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క కాటు సంఘటనలకు కుక్కలకు ఆహారం బహిరంగంగా తినిపించే వారిని కూడా బాధ్యులుగా జవాబుదారీగా ఉంచుతామని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వీధి కుక్కలను జనవాస ప్రాంతాలు రోడ్ల నుండి దూరంగా ఉంచాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. నవంబర్ 7, 2025 నాటి ఆదేశాన్ని సవరించాలని కోరుతూ అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. గత సంవత్సరం జూలై నుండి కోర్టు ఈ విషయాన్ని సుమోటో కేసుగా విచారిస్తోంది.

Tags:    

Similar News