• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హెచ్ సీఏ నష్ట నివారణ.....

హెచ్ సీఏ నష్ట నివారణ.. సన్ రైజర్స్ తో సంధి.. కార్యదర్శే కీలకం

| అయితే, బీఆర్ఎస్ హయాంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అయిన జగన్మోహన్‌ రావు సన్ రైజర్స్ తో సమావేశానికి దూరంగా ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2025-04-02 19:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ సన్‌ రైజర్స్‌, హైదరాబాద్ క్రికెట్ సంఘం మధ్య ఎట్టకేలకు సంధి కుదరింది. ఉచిత పాస్ ల వివాదంతో హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని సన్ రైజర్స్ హెచ్చరించడం.. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కలగజేసుకోవడంతో వివాదం పెద్దదిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నష్ట నివారణ చర్యలకు దిగింది. ఉచిత పాస్‌లు, ఇతర అంశాలపై సన్‌రైజర్స్‌ ప్రతినిధులతో హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్‌.దేవరాజ్‌ చర్చలు జరిపారు.

బీసీసీఐ, హెచ్‌సీఏ, సన్‌ రైజర్స్‌.. మధ్య కుదిరిన త్రిముఖ ఒప్పందాన్ని కచ్చితంగా పాటించాలని, గతంలోలానే స్టేడియం సామర్థ్యంలో పది శాతం పాస్‌ లను హెచ్‌సీఏకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు సన్‌ రైజర్స్‌ కు సహకరిస్తామని హెచ్‌సీఏ తెలిపింది.

అయితే, బీఆర్ఎస్ హయాంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అయిన జగన్మోహన్‌ రావు సన్ రైజర్స్ తో సమావేశానికి దూరంగా ఉన్నారు. అసలు వివాదం ఆయన మీదనే కావడం గమనార్హం. నిర్దేశిత 10 శాతం కాకుండా అదనంగా ఇవ్వాలని ఆయన బెదిరించినట్లు, తమను ఇబ్బంది పెట్టినట్లు హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌ రైజర్స్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్‌సీఏ వ్యవహారాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు.

హెచ్ సీఏ, సన్ రైజర్స్ మధ్య వివాదం రెండు రోజుల పాటు నలిగింది. అయితే, ఇరు వర్గాల స్పందనతో త్వరగా సమసింది. విజిలెన్స్ విభాగంతో సమావేశంలో సన్‌రైజర్స్, హెచ్ సీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ప్రతి ఆటకు 3,900 కాంప్లిమెంటరీ టిక్కెట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.

కాగా, హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును పూర్తిగా పక్కనపెట్టి కార్యదర్శి దేవ్ రాజ్ సారథ్యంలోనే చర్చలు జరిగాయి. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత, గతంలో బీఆర్ ఎస్ లోనూ కీలకంగా వ్యవహరించిన నాయకుడికి చెందిన మనిషి. ఆ నాయకుడి కుమార్తె జీహెచ్ఎంసీలో కీలక పదవిలో ఉన్నారు. మరోవైపు మాజీ సీఎం మనవడు, మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఒకరు కూడా చర్చల్లో కీలక పాత్ర పోషించారు. కానీ ,జగన్ మోహన్ రావు మాత్రం పాల్గొనలేదు.

Tags:    
  • SunrisersHyderabad 
  • HyderabadCricketAssociation 
  • TelanganaPolitics 
  • IPL2025 
  • BCCICricket 
  • HCA 
  • CricketTicketControversy 

Similar News

సోనియా ఆత్మ‌కథ‌: జ‌నాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!

2026-11-11 18:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

Copyright @2026

Powered by Blink CMS