సినిమా సీన్ తో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహాలు!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఒక సూపర్ హిట్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు సలహాలు ఇచ్చారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.

Update: 2024-05-18 16:30 GMT

సినిమాల్లో మంచీ ఉంటుంది.. చెడూ ఉంటుంది.. ఏది తీసుకుంటామనేది నీ విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది అని అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఒక సూపర్ హిట్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు సలహాలు ఇచ్చారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుందర్ పిచాయ్... బట్టీ పట్టి చదవడంపైనా, తనకు ఇష్టమైన ఇండియన్ ఫుడ్ గురించీ అసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రధానంగా... ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికత వినియోగం నానాటికీ పెరుగుతోన్న నేపథ్యంలో... అభ్యర్థుల్లో ఉద్యోగాలపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే! దీంతో ఉద్యోగులకు సూచనలు అందించారు సుందర్‌ పిచాయ్‌.

వివరాళ్లోకి వెళ్తే... ప్రపంచంలోనే టాప్ టెక్ సంస్థలైన ఫేస్ బుక్, యాపిల్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, గూగుల్ వంటి సంస్థల్లోని ఇంటర్వ్యూల్లో విజయం సాధించడంలో పాటించాల్సిన తెలుసుకోవాల్సిన మెలుకువల గురించి యువకులకు సలహా ఇవ్వాలని ఇంటర్వ్యూయర్ సుందర్ పిచాయ్ ని కోరారు. దీంతో... “బట్టీ పట్టి చదవడం” అనే అంశాన్ని ప్రస్థావించారు పిచాయ్!

ఇదే సమయంలో... ప్రధానంగా ఏదైనా ఒక విషయాన్ని వీలైనంత లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా నిజమైన జ్ఞానం, నిజమైన విజయం వస్తుందని తాను బలంగా నమ్ముతానని సుందర్ పిచాయ్ తెలిపారు! సరిగ్గా ఈ పద్ధతినే ఇప్పటి సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా "3 ఇడియట్స్" సినిమా ప్రస్థావన తెచ్చారు.

Read more!

ఇందులో భాగంగా.. ఏదైనా ఒక విషయాన్ని, లేదా అంశాన్ని కేవలం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మధ్య ఉన్న తేడాను వివరించేందుకు "3 ఇడియట్స్‌" సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేశారు పిచాయ్. అందులో... "మోటార్‌ ఎలా పనిచేస్తుందో నిర్వచించమని ఓ విద్యార్థిని అడగ్గా.. కంఠస్థం చేసిన డెఫినేషన్‌ చెప్పకుండా సాధారణ పదాలతో యంత్రం అంటే ఏమిటో వివరిస్తాడు.. విషయాన్ని గ్రహించడమంటే ఇదే" అని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.

ఇక తనకు ఇష్టమైన ఇండియన్ ఫుడ్ పైనా స్పందించిన పిచాయ్.. ప్రాంతాన్ని బట్టి తనకు వంటకాలు నచ్చుతాయని అన్నారు. ఇందులో భాగంగా... బెంగళూరులో ఉన్నప్పుడు దోశ బాగా తినేవాడినని.. ఢిల్లీలో అయితే చోలే బటూరె.. ముంబయిలో అయితే పావ్‌ భాజీ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News