బాబు నెత్తిన ముళ్ళ కిరీటం !?

ఇదిలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం విజయవాడ పశ్చిమం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సుజనా చౌదరి అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూటమి మంచి ఆధిక్యతతో గెలుస్తుంది అని అంటూనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-09 19:05 GMT

ఏపీలో పోలింగ్ కి ఇంకా అతి తక్కువ సమయం ఉంది. ప్రచారం చూస్తే చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే టీడీపీ కూటమి నుంచి పోటీలో ఉన్న వారు బిగ్ షాట్స్ ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు. జనాల్లోకి ప్రచారానికి వెళ్తున్నారు అలాగే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం విజయవాడ పశ్చిమం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సుజనా చౌదరి అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూటమి మంచి ఆధిక్యతతో గెలుస్తుంది అని అంటూనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదెలా అంటే ఏపీలో టీడీపీ కూటమి నెగ్గినా చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి ముళ్ళ కిరీటంగా మారుతుంది అని అన్నారు.

ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ తక్కువగా చూడడం లేదు. అదే విధంగా ఆయన ఎందుకు ఈ కామెంట్స్ చేశారు అని కూడా తరచి చూస్తున్నారు. ఏపీలో చూస్తే ఎవరు కాదన్నా పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. వడ్డీలకే లక్షల కోట్లు ఖర్చు అవుతాయని కూడా చెబుతున్నారు. ఇక ఏపీలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పధకాలను పోటాపోటీగా వైసీపీ టీడీపీ ప్రకటించాయి. ఇంకా చెప్పాలంటే టీడీపీయే ఎక్కువ హామీలు ఇచ్చింది.

దాంతో పాటు ఈ పధకాల అమలు అన్నది కత్తి మీద సాము. అలాగే ఏపీకి రాజధాని లేదు, పోలవరం పూర్తి కావాలి. అలాగే అభివృద్ధి జరగాలి.ఏపీ బడ్జెట్ చూస్తే రాష్ట్ర రెవిన్యూ కేంద్రం పన్నుల ద్వారా ఇచ్చే ఆదాయం అన్నీ చూసుకున్నా లక్షన్నర కోట్ల రూపాయలను మించదు. దాంతో ఏపీలో సంక్షేమం పూర్తిగా తీసి పక్కన పెట్టినా ఉద్యోగులకు జీతాలు ఇతరత్రా వాటికే లక్షా పాతిక కోట్ల రూపాయలు పోతాయి. ఆ మిగిలిన దాంట్లో ఎంతో కొంత అభివృద్ధి చూపించాల్సి ఉంటుంది.

Read more!

ఇక పోలవరం భారీ బడ్జెట్. ముందు స్టేట్ ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ చేపడితేనే కేంద్రం రీఇంబర్స్మెంట్ గా ఇస్తుంది. రాజధాని విషయం కూడా ఏపీ ప్రభుత్వం చూసుకోవాలి. చంద్రబాబు ప్రయారిటీ అమరావతి అయినా మౌలిక సదుపాయాలకు యాభై వేల ఎకరాలకు లక్ష కోట్లు అంటున్నారు. వాటికి నిధులు తీసి పెట్టాల్సి ఉంది.

ఇక సంక్షేమం పూర్తిగా తీసి పెట్టడం అవుతుందా అంటే అసలు కానే కాదు ఎన్ని కటింగులు పెట్టినా సంక్షేమానికి లక్ష కోట్లు వెచ్చించాలంటే ఏపీ కచ్చితంగా మరోసారి అప్పుల వైపు చూడాల్సిందే. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అన్ని చోట్లా అప్పులు చేసి పారేసింది అని అంటున్నారు. దాంతో కొత్త అప్పులు పుడతాయా అన్నది కూడా చూడాల్సిందే. కూటమిలో ఉన్నా ఏపీ విషయంలో బీజేపీ ఉదారంగా అప్పులు అయినా ఇస్తుంది అని ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. ఒకవేళ ఇచ్చినా ఏపీ ఎంతవరకూ తట్టుకుంటుంది అన్నది బిగ్ క్వశ్చన్.

అందుకే సీఎం పోస్టు అని అధికారం దక్కుతుందని కూటమి నేతలకు ఆనందం అయితే పెద్దగా ఉండడం లేదు. వీటిని అన్నింటినీ విశ్లేషించుకున్న మీదటనే సుజనా చౌదరి తనకు ఉన్న అనుభవంతో చంద్రబాబుకు సీఎం పోస్ట్ ముళ్ల కిరీటం అని ముందే అంటున్నారు. అంతే కాదు ఆయన మరో మాట అంటున్నారు. కూటమి చేసిన హామీలు అన్నీ తీర్చాలంటే ఓవర్ నైట్ జరిగే పని కాదు అని.

మరి సుజనా చౌదరి ఈ తరహా కామెంట్స్ చేసిన మీదట నిజంగా ఈసారి సీఎం పోస్ట్ అన్నది బాబుకు అయినా లేక జగన్ కి అయినా ముళ్ళ కిరీటమే అవుతుంది అని అంతా అంటున్న నేపధ్యం ఉంది. ఏపీలో సంపద సృష్టి అన్నది ఓవర్ నైట్ జరిగేది కాదు. అభివృద్ధి నిరంతరంగా జరిగినా మరో పదేళ్ళకు ఫలితాలు దక్కవచ్చేమో. అప్పటి దాకా అప్పులతోనే సావాసం చేయాలి. నిజం చెప్పాలంటే ఎంత పొదుపుగా బండి లాగిస్తే అంతలా ఏపీకి మేలు. కానీ అధికారం కోసం ఇస్తున్న సంక్షేమ పధకాల హామీలు ఏపీని ఎక్కడకు తీసుకుని వెళ్తాయన్న చర్చ అయితే సగటు జనాలలో ఉంది.

Tags:    

Similar News