ట్రంప్ ప్రైవేట్ లైఫ్ బహిర్గతం... కోర్టులో సాక్ష్యం చెప్పిన అడల్ట్ స్టార్!

అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-08 11:19 GMT

అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అతనికి సంబంధించిన వ్యవహారలు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ సమయంలో ట్రంప్ తో తనకున్న అనుబంధాన్ని ఓ పో*ర్న్ స్టార్ కోర్టులో చెప్పడం వైరల్ గా మారింది.

అవును... 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో తమ ఇరువురి మధ్య సంబంధం బయటపడకుండా ఉండేందుకు.. ట్రంప్ భారీ మొత్తంలో స్టార్మీ డేనియల్‌ కు డబ్బులిచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ట్రంప్‌ తో ఏకాంతంగా గడిపినట్లు పో*ర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌ పేర్కొన్నారు.

ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె న్యూయార్క్‌ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీంతో... నాటి అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ మరింత చర్చనీయాంశం అవుతుంది!

ఈ సందర్భంగా న్యూయార్క్ కోర్టులో మాట్లాడిన స్టార్మీ... 2006వ సంవత్సరంలో జరిగిన ఓ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ లో డొనాల్డ్ ట్రంప్‌ ను తొలిసారిగా కలిసినట్లు తెలిపారు. ఆ తర్వాత బాడీగార్డ్‌ ద్వారా తనను డిన్నర్‌ కు ఆహ్వానించి.. అనంతరం హోటల్‌ సూట్‌ కు తీసుకెళ్లారని ఆమె తెలిపారు.

Read more!

ఈ సమయంలో ఆయన ఉద్దేశం ఏంటో తనకు అర్థమైందని చెప్పిన స్టార్మీ డేనియేల్... ఆ హోటల్ సూట్ లో ఇద్దరూ ఏకాంతంగా గడిపినట్లు వెల్లడించారు. అయితే తర్వాత చాలాసార్లు ఇద్దరం భేటీ అయినప్పటికీ.. సన్నిహితంగా మాత్రం మెలగలేదని.. తమ సంబంధం గురించి ఎంతోమందికి తెలుసని ఆమె కోర్టులో వెల్లడించారు.

ఈ క్రమంలో 2011 సమయంలో ఓ బ్లాగ్‌ ద్వారా తమ ఇద్దరి రిలేషన్ గురించిన వ్యవహారం బయటకు వచ్చిందని చెప్పిన స్టార్మీ... 2016 ఎలక్షన్ టైం లో సుమారు 1,30,000 డాలర్లను ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కోహెన్‌ నుంచి తాను స్వీకరించినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే.. ట్రంప్‌ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు.

ఈ సమయంలో ఆమె ఆరోపణలపై ట్రంప్ తరుపు న్యాయవాదులు స్పందించారు. ఇందులో భాగంగా.. ఆమె ఆరోపణలు తోసిపుచ్చారు. కేవలం డబ్బుల కోసమే ఆమె అమెరికా మాజీ అధ్యక్షుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు. ఈ విధంగా ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ సమయం వాదనలు కొనసాగాయి.

ఇక... తనపై స్టార్మీ డానియేల్ కోర్టులో వాంగ్మూలం ఇస్తున్న సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కోర్టు రూం లోనే ఉన్నారని.. వాదనల సమయంలో తన న్యాయవాదులతో గుసగుసలు ఆడుతున్నట్లు కనిపించారని చెబుతున్నారు!

Tags:    

Similar News