సీమ ఇమేజ్ పూర్తిగా మార్చేసే ప్రాజెక్టు నేడే శంకుస్థాపన!

రాయలసీమ జిల్లాలు అన్నంతనే మిగిలిన ప్రపంచానికి ఉండే ఇమేజ్ కు.. గడిచిన కొన్నేళ్లుగా ఆ జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్న మార్పుల మీద చాలామందికి అవగాహన తక్కువ.

Update: 2026-05-15 05:09 GMT

రాయలసీమ జిల్లాలు అన్నంతనే మిగిలిన ప్రపంచానికి ఉండే ఇమేజ్ కు.. గడిచిన కొన్నేళ్లుగా ఆ జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్న మార్పుల మీద చాలామందికి అవగాహన తక్కువ. కియో కార్ల కంపెనీ ఎంట్రీతో ఉమ్మడి అనంత జిల్లా కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఉమ్మడి అనంతలోని కొన్ని ప్రాంతాల్ని కలిపి శ్రీసత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేయటం తెలిసిందే.

ఈ జిల్లా ప్రత్యేకత ఏమంటే.. ఇక్కడి తూమకుంట పారిశ్రామిక ప్రాంతంలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. అంతేనా.. పది వేల కోట్ల రూపాయిల వ్యయంతో అత్యాధునిక సెమీకండక్టర్ల తయారీ యూనిట్ తో పాటు.. ఏరో స్పేస్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ స్థానాలకు నెలవైన శ్రీసత్యసాయి జిల్లాలో మొత్తం నాలుగు రెవెన్యూ డివిజన్లు (పుట్టపర్తి.. పెనుకొండ.. కదిరి.. మడకశిర) ఉన్నాయి. మొత్తం 32 మండలాలతో 17.2 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలోనే కియా, హ్యుందాయ్ మోబిన్, హ్యుందాయ్ ట్రాన్సిస్, ఎస్ హెచ్ కె మెటల్స్, సియోన్ ఇ హ్వా.. లాంటి అంతర్జాతీయ ఆటోమెబైల్ విడిభాగాల తయారీ ప్లాంట్లు మాత్రమే కాదు.. ప్రముఖ ఇన్నర్ వేర్ బ్రాండ్ జాకీ ఉత్పత్తుల తయారీ యూనిట్ తో పాటు..బెర్జర్ పెయింట్స్ తయారీ సంస్థ తమ ప్లాంట్లను ఇక్కడే నిర్వహిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏరో స్పేస్ రంగానికి ఈ జిల్లా కేరాఫ్ అడ్రస్ గా మారనుంది. రేమండ్ గ్రూప్ నకు ెందిన జెకె మైని గ్లోబల్ ఏరో స్పేస్ సంస్థ అత్యాధునిక ఏరో స్పేస్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. అంతేకాదు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ సోలార్ పవర్ ప్రాజెక్టుతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను స్ధాపిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ రోజు (శుక్రవారం) కేంద్ర రక్షణ మంత్రిశాఖ ఆధ్వర్యంలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. దీనికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తోపాటు.. ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం పుట్టపర్తిలో జరగనుంది. ఇందుకోసం పుట్టపర్తి రన్ వేకు ఆనుకొని ఉన్న 600 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోంది.

ఈ హబ్ లో తయారు చేసే అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాల పరీక్షల కోసం రన్ వేను పది వేల అడుగులకు విస్తరించనున్నారు. అంతేకాదు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, అధునాతన నావిగేషన్ వ్యవస్థలను ఇక్కడ నిర్మించనున్నారు. అంతేనా.. దేశీయ సాంకేతికతతో తయారు చేసే ఐదో తరం యుద్ధ విమానాల అసెంబ్లీ.. టెస్టింగ్.. సర్టిఫికేషన్ ప్రక్రియలు ఈ కేంద్రం నుంచే జరుగుతాయి. ఈ ప్రాజెక్టుతో దేశంలోనే శ్రీసత్యసాయి జిల్లా అతి పెద్ద డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హబ్ గా మారనుంది. వీటికి తోడుగా భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ తో పాటు ప్రైవేట్ డిఫెన్స్ భాగస్వామ్య కంపెనీలు పెద్ద ఎత్తున రానున్నాయి. మొత్తంగా ఈ భారీ ప్రాజెక్టు పుణ్యమా అని దాదాపు రూ.లక్ష కోట్ల మేర పెట్టబడులు రానున్నాయి. మొత్తంగా శ్రీసత్యసాయి జిల్లా రూపురేఖలు మారేలా ఈ ప్రాజెక్టు కారణం కానుంది.

ఈ జిల్లాకు ఉన్న మరో ప్రత్యేకత ఏమంటే.. దీని సరిహద్దుల్లో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు కాస్త సమీపంగా ఉండటం.. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో సరిహద్దుల్ని పంచుకునే ఈ జిల్లా రానున్న రోజుల్లో ఏరో స్పేస్ రంగానికి ఒక హబ్ గా మారటం ఖాయమని చెప్పాలి. మొత్తంగా సీమ జిల్లాల్లో ఇస్పెషల్ జిల్లాగా రానున్న రోజుల్లో శ్రీసత్యసాయి జిల్లా నిలుస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News