రఘురామ టార్చర్ కేసు : సునీల్ కుమార్ కి నోటీసులు
ఇదిలా ఉంటే రఘురామను కస్టడీకి తీసుకుని టార్చర్ పెట్టడంతో ఆనాడు అత్యున్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుని ఆయనకు సరైన వైద్య పరీక్షలు చేయించాలని హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రికి చేర్పించాలని ఆదేశించింది.;
ఏపీ శాసన సభ ఉప సభాపతిగా ఉన్న రఘురామ క్రిష్ణం రాజు వైసీపీ ఎంపీగా ఉన్న కాలంలో 2021 టైంలో ఆయన మీద కేసు పెట్టి కస్టడీలోకి తీసుకుని మరీ టార్చర్ పెట్టారు అన్నది ఒక తీవ్రమైన అభియోగం. ఒక ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని ఆయన కళ్ళు బొబ్బలు అయ్యేలా కొట్టారని అప్పట్లో రఘురామ ఆయన కుటుంబీకులు ఆరోపించారు దీని మీద లోక్ సభలో కూడా స్పీకర్ కి రఘురామ ఫిర్యాదు చేయడం ఆనాడు చర్చనీయంశం అయింది. ఈ నేపధ్యంలో రఘురామ క్రిషణం రాజు నాటి నుంచే తనకు న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో అయినా తన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులకు శిక్ష పడాలని ఆయన గట్టిగా కోరుకున్నారు. మొత్తానికి ఎట్టలేకలు ఈ కేసు అన్నది ముందుకు కదిలింది. ఇపుడు ఆనాడు ఈ కేసులో కీలక పాత్ర పోషించారు అధికార దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణల మీద సునీల్ కుమార్ ని సిట్ అధికారులు విచారించేందుకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఏపీ రాజకీయాల్లో అతి ముఖ్యమైన పరిణామంగా దీనిని అంతా చూస్తున్నారు.
పెండింగ్ లో కేసుగా :
ఏపీలో చూస్తే కీలక నేత రాజకీయంగా అత్యంత పలుకుబడి కలిగిన రఘురామ విషయంలో ఈ విధంగా అన్యాయం జరిగిందని ఆయనకు న్యాయం జరగాలని అంతా కోరుకున్నారు ఈ క్రమంలో సునీల్ కుమార్ కి సిట్ నోటీసులు ఇవ్వడంతో అంతటా చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా ఉంటే 2021లో హైదరాబాద్ లో తన ఇంట్లో పుట్టిన రోజు జరుపుకుంటున్న రఘు రామను ఏపీకి తీసుకుని వచ్చి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను గుంటూరు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అలా అధికారులు తమ పవర్ ని దుర్వినియోగం చేశారు అని రఘురామ సహా నాటి విపక్ష నేతలు అంతా ఆరోపించారు.
సుప్రీం జోక్యంతో :
ఇదిలా ఉంటే రఘురామను కస్టడీకి తీసుకుని టార్చర్ పెట్టడంతో ఆనాడు అత్యున్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుని ఆయనకు సరైన వైద్య పరీక్షలు చేయించాలని హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రికి చేర్పించాలని ఆదేశించింది. ఆ మీదట ఆయన తన మీద కస్టడీలో దాడి జరిగింది అని చేసిన ఫిర్యాదు మీద ఏపీలో కూటమి ప్రభుత్వం సిట్ ని విచారణకు ఏర్పాటు చేసింది అలా విజయనగరం ఎస్పీ నాయకత్వంలో సిట్ ఈ కేసులో అనేక మంది అధికారులను ఇప్పటికే ప్రశ్నించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలకమైన అధికారిగా అనాడు సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్ ని ఇపుడు సిట్ విచారించబోతోంది. రఘురామ అరెస్టు విషయంలో పర్యవేక్షణ చేసింది సునీల్ కుమార్ అని ఆరోపణలు ఆయనే చేశారు.
హాజరు కావాలంటూ :
ఇదిలా ఉంటే సునీల్ కుమార్ ప్రస్తుతం బీహార్ లో పనిచేస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయనకు సిట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా డిసెంబర్ 4న తమ ఎదుట హాజరు కావాలని అందులో కోరింది. దాంతో ఈ కేసులో ఉత్కంఠ అయితే పెరిగింది. మరి రఘురామను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుని టార్చర్ చేశారు అని ఆరోపణలు ఉప సభాపతి వైపు నుంచి ఉన్న నేపథ్యంలో అప్పట్లో ఏమి జరిగింది అన్నది ఈ టార్చర్ ని ఎవరు చేశారు, ఎవరు పర్యవేక్షించారు అన్నది పూర్తిగా వెలుగులోకి వస్తుందా అన్నది అయితే అంతటా చర్చగానే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.