• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చెన్నైలో డాక్టర్...

చెన్నైలో డాక్టర్ దుర్మార్గం.. చంపేసి.. వాసన రాకుండా ఏసీ వేసి మరీ!

| ఒక డాక్టర్ దుర్మారం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇలా కూడా చేస్తారా? అన్నట్లుగా ఉండే ఈ ఉదంతం చెన్నైలో చోటు చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2025-02-01 11:30 GMT

ఒక డాక్టర్ దుర్మారం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇలా కూడా చేస్తారా? అన్నట్లుగా ఉండే ఈ ఉదంతం చెన్నైలో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న కొత్త తరహా నేరాలు కొత్త భయాలకు తెర తీస్తున్నాయని చెప్పాలి. చెన్నైలోని తిరుముల్లైవాయల్ లోని ఒక అపార్టుమెంట్ లో ఉంటున్న తండ్రి,కూతుళ్ల మృతదేహాల మిస్టరీకి సంబంధించి ఒక వైద్యుడ్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వెలుగు చూసిన వివరాల్ని చూస్తే.. షాక్ కు గురి కావాల్సిందే.

70 ఏళ్ల శంకర్.. ఆయన కుమార్తె 37 ఏళ్ల సింథియా చెన్నైలో ఉంటారు. అయితే.. శంకర్ కిడ్నీసమస్యతో బాధ పడుతుండేవారు. ఇదిలా ఉండగా ఆయన కుమార్తె సింథియాకు ఆన్ లైన్ లో పరిచమయ్యారు డాక్టర్ శ్యాముల్. దీంతో.. తన తండ్రికి చికిత్స చేయాలని కోరగా.. అతను అంగీకరించారు. అయితే.. శ్యాముల్ వేలూరులో ఉండేవాడు. దీంతో.. ప్రతిసారి వేలూరు నుంచి వచ్చి చికిత్స చేయటం ఇబ్బందిగా మారటంతో వారిని అపార్టుమెంట్ లో ఉంచి తానే వచ్చి వైద్యం చేస్తుండేవాడు.

చికిత్స పొందుతున్న శంకర్.. గత సెప్టెంబరు 6న చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రి మరణం తట్టుకోలేని సింథియా డాక్టర్ శ్యామూల్ ను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా పెరగటం.. సింథియాను నెట్టేయటంతో ఆమె తలకు గాయమై.. మరణించింది. దీంతో షాక్ కు గురైన డాక్టర్ శ్యామూల్ తండ్రీ కూతుళ్ల డెడ్ బాడీలను ఒక గదిలో ఉంచి తాళం వేసి వెళ్లారు. దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏసీ వేసి కాంచీపురం వెళ్లాడు. వారానికి రెండుసార్లు వచ్చి.. కెమికల్స్ చల్లి వెళ్లేవాడు. ఈ విషయం బయటకు వస్తే కాంచీపురంలో గుండె కు సర్జరీ చేసుకున్న తల్లికి ప్రమాదం జరుగుతుందని ఐదునెలలుగా తండ్రికూతుళ్ల మరణాల్ని దాచి ఉంచాడు.

ఇటీవల కరెంట్ పోవటం.. శంకర్ ఇంటి నుంచి భయంకరమైన దుర్వాసన రావటంతో అపార్టుమెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాళం పగలకొట్టి లోపలకు వెళ్లిన వారంతా కుళ్లిపోయి.. ఆస్తిపంజరాలుగా ఉన్న తండ్రీకూతుళ్లు కనిపించారు. ఈ క్రమంలో డాక్టర్ శ్యామూల్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు 12 గంటల పాటు విచారించగా.. అన్ని వివరాల్ని వెల్లడించారు. శంకర్ బంధువులకు వాట్సాప్ కాల్ చేయటం.. మిస్డ్ కాల్స్ చేస్తూ మేనేజ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ ఉదంతంలో డాక్టర్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారం తెలిసిన వారంతా విస్తుపోతున్నారు.

Tags:    
  • Chennai 
  • Crime 
  • Doctorcrime 
  • Socialmediainfluence 
  • Murder 
  • Fatheranddaughter 
  • Kanchipuram 
  • Murdermystery 
  • Hidingbodies 

Similar News

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ వీడియోలకు చెక్.. మెటా కొత్త రూల్స్!

2026-11-18 07:06 GMT

రేవంత్ ను పొడవడానికి ‘కోమటిరెడ్డి’ ఒక్కడు చాలు.. ‘రూ.5వేల’ మంటపెట్టాడు..

2026-11-18 07:05 GMT

అమెరికాలో మరో షాక్.. NSA రహస్య నెట్‌వర్క్ కూడా డౌన్!

2026-11-18 06:51 GMT

ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా.. ‘షాల్ వుయ్ మూవ్?’ అన్న మోదీ!

2026-11-18 06:50 GMT

బీజేపీ మాధవ్ కి మరో పరీక్ష

2026-11-18 03:35 GMT

పాదయాత్రకు జగన్ తొందర...రీజన్ అదేనా ?

2026-11-18 03:35 GMT

వైసీపీ ట్రాప్ లో షర్మిల...నిజమేనా ?

2026-11-18 03:34 GMT

పతులు ఎమ్మెల్యేలు...సతులు ఊరి పెద్దలు !

2026-11-18 03:34 GMT

నంబర్ 850....బీజేపీ భారీ వ్యూహం !

2026-11-18 02:46 GMT

నాలుగు సార్లు విజేతగా సోనియా... రాహుల్ చెప్పిన నిజం

2026-11-18 02:46 GMT

Copyright @2026

Powered by Blink CMS