షాకింగ్... ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ ఐస్ లో మల బాక్టీరియా!
ఈ సమయంలో.. సోషల్ మీడియాలో బీబీసీ పరిశోధనగా వైరల్ అవుతోన్న పోస్టుల్లో.. ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.;
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు.. ఆ మహాభాగ్యం, సరైన ఆహారపు అలవాట్ల వల్ల ప్రాప్తిస్తుందని చెబుతారు. అయితే ఇటీవల కాలంలో మారిన జీవనశైలిలో భాగంగానో ఏమో కానీ... ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ వైపు చాలామంది రెగ్యులర్ చూపు ఉంటున్న పరిస్థితి. ఈ సమయంలో.. సోషల్ మీడియాలో బీబీసీ పరిశోధనగా వైరల్ అవుతోన్న పోస్టుల్లో.. ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. మహా మహా పేరున్న ఫుడ్ ఛైన్స్ రెస్టారెంట్స్ లోని ఐస్ లో మల బాక్టీరియా ఉన్నట్లు చెబుతున్నారు! దీంతో ఈ విషయం షాకింగ్ గా మారింది.
అవును... ఆహార పరిశుభ్రత ఆరోగ్యంపై పూర్తిగా ప్రభావం చూపుతుందనే సంగతి తెలిసిందే. అందుకే ఈ విషయంలో ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, హోటల్సు, ఫుడ్ కోర్టులపై ప్రభుత్వాలు సీరియస్ గా చర్యలు తీసుకోవాలని.. కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టకూడదని కోరుతుంటారు! ఇటీవల అధికారులు చేపట్టిన దాడుల్లో.. పలు హోటల్స్ లో కుల్లిన చికెన్, పురుగులు పట్టిన మీట్ కనిపించిన కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే! అది చూసినవారు.. మళ్లీ ఆ హోటల్స్ వైపు చూడటానికి చాలా సమయం తీసుకున్నారని అంటున్నారు!
ఆ సంగతి అలా ఉంటే.. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతున్న బీబీసీ పరిశోధనగా చెబుతున్న పోస్టుల్లో.. యూకే వ్యాపంగా మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్, కే.ఎఫ్.సీ. అవుట్ లెట్ లతో పాటు పలు రెస్టారెంట్స్ నుంచి ఐస్ నమూనాలను పరీక్షించగా.. తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. పరీక్షించబడిన నమూనాలలో సుమారు 50 శాతానికి పైగా మల బాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారని అంటున్నారు! ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా, షాకింగ్ గా మారింది.
అయితే... ఈ సమస్య పరిశుభ్రత పాటించకపోవడం వల్లనే వచ్చిందని.. ఈ కలుషితమైన ఐస్ తరచుగా ఉద్యోగులు శుభ్రం చేయని చేతులను ఉపయోగించడం వల్ల లేదా సరిగ్గా శుభ్రం చేయని ఐస్ యంత్రాల వల్ల వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ఏబీసీ న్యూస్ అమెరికాలోనూ ఇలాంటి పరిశోధన నిర్వహించినప్పుడు కొన్ని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ లోని ఐస్ లో టాయిలెట్ వాటర్ కంటే ఎక్కువ బాక్టీరియా ఉందని కనుగొందని చెబుతున్నారు!
అయితే ఈ పరిస్థితి కేవలం మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్, కే.ఎఫ్.సీ. లకే పరిమితం కాలేదని.. స్టార్ బక్స్, కోస్టా కాఫీ, కాఫే నీరో నుంచి వచ్చిన ఐస్డ్ డ్రింగ్స్ లోనూ మల బాక్టీరియాను ఇలాంటి పరీక్షల్లో గుర్తించారని అంటున్నారు! ఈ నేపథ్యంలో.. ఈ నమూనాలను విశ్లేషించిన లీడ్స్ బెకెట్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ మార్గరీట గోమేజ్ ఎస్కలాడా స్పందిస్తూ.. ప్రధానంగా ఈ సమస్య మురికి చేతులతో తాకడం వల్ల వస్తుందని.. బలహీన రోగనిరోదక శక్తి ఉన్నవారిలో ఈ బాక్టీరియా తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందని అంటున్నారు!