వైసీపీ ఓట్లు చీల్చడమే టార్గెట్...షర్మిల ఆడియో లీక్ !?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ని దెబ్బ తీయడమే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతున్నారు అని ఆ ఆడియో లీక్ ద్వారా అర్ధం అయింది అంటున్నారు.

Update: 2024-05-01 16:58 GMT

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు అసెంబ్లీ సీటు టికెట్ విషయంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్ధి వంతల సుబ్బారావు తో ఆమె వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలతో కూడిన ఆడియో లీక్ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ని దెబ్బ తీయడమే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతున్నారు అని ఆ ఆడియో లీక్ ద్వారా అర్ధం అయింది అంటున్నారు.

పాడేరు కాంగ్రెస్ టికెట్ ని మొదట వంగల సుబ్బారావుకు ఇచ్చారు షర్మిల. అయితే వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన బుల్లిబాబుకి అదే టికెట్ ని వంతల సుబ్బారావుకి దెబ్బ కొట్టి మరీ ఇచ్చేశారు. దీంతో అలిగిన సుబ్బారావు కాంగ్రెస్ రెబెల్ గా పోటీకి దిగారు. ఈ నేపధ్యంలో సుబ్బారావుని బుజ్జగించడానికి షర్మిల ఫోన్ చేసి మాట్లాడారు.

తన సొంత అన్నగా మిమ్మల్ని భావిస్తున్నా మీరు విత్ డ్రా అవండి అని ఆమె కోరారు. అంతే కాదు బుల్లిబాబు వైసీపీ నుంచి వచ్చారు. ఆయన రాక వల్ల వైసీపీ ఓట్లు కూడా కలుస్తాయి అలా వైసీపీ ఓట్లలో చీలిక వస్తుంది అని షర్మిల అన్నట్లుగా ఆడియోలో ఉంది. అయితే వంతల సుబ్బారావు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గినట్లుగా ఆ ఆడియోలో లేదు.

మీరు కాంగ్రెస్ రెబెల్ గా పోటీ చేస్తే కనుక పార్టీ నుంచి దూరం అవుతారని ఆమె బెదిరించారు. అయినా నాకు జరగాల్సిన నష్టం జరిగింది ఇక నేను విత్ డ్రా కాను అన్నట్లుగానే సుబ్బారావు మాట్లాడారు. మొత్తం మీద చూస్తే వైసీపీనే టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలనే చేర్చుకుంటూ షర్మిల వైసీపీ ఓటు బ్యాంక్ దెబ్బ కొట్టడానికే చూస్తున్నారు అన్న ఫ్యాన్ పార్టీ నేతల ఆరోపణలు ఈ ఆడియో లీక్ తో నిజం అయ్యాయని అంటున్నారు.

Read more!

ఇక ఇదే ఆడియోలో డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్నారు అన్న ప్రచారం మీద కూడా షర్మిల సుబ్బారావు మీద ఫైర్ అయ్యారు. అలాంటిది ఏమీ లేదని ఆమె అన్నారు. మొత్తానికి చూస్తే అంతా ఒక వ్యూహం ప్రకారమే సాగుతోంది అని అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారినే ఇప్పటిదాకా కాంగ్రెస్ లో చేర్చుకోవడం తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి ఏ ఒక్కరికీ కండువాలు కప్పకపోవడం బట్టి చూస్తే ఇదంతా వైసీపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారు అని అంటున్నారు.

అంతే కాదు ఏపీలో వైసీపీ దెబ్బ తిని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా షర్మిలకు కాంగ్రెస్ కి ఫ్యూచర్ ఉంటుంది. అదే వైసీపీ అధికారంలోకి మరోసారి వస్తే కనుక కాంగ్రెస్ కి భవిష్యత్తు ఉండదు, షర్మిల కెరీర్ కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే ఆమె జగన్ నే విమర్శిస్తూ టార్గెట్ చేస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేయడం వెనక కూడా వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.

ఇన్నాళ్ళూ వైసీపీ నేతలు ఇవి ఆరోపణలుగా చేస్తే ఆడియో ద్వారా షర్మిల అసలు వ్యూహాలు ఏమిటి అన్నవి తెలిసిపోయాయని అంటున్నారు. సో ఇదన్న మాట ఒక అన్న మీద ఆయన పార్టీ మీద చెల్లెలు పొలిటికల్ రివెంజ్ అని వైసీపీలోనే ఆశ్చర్యపోతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News